E-Paper
Advertisement

చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ప్రయాణానికి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా?  ప్రయాణానికి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
Advertisement

Char Dham Yatra Travel Advisory: చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉండటంతో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దీంతో యాత్రకు బయలుదేరే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం!

IMD తాజా సమాచారం ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు, పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యాత్రకు బయలుదేరే ముందు తప్పనిసరిగా తాజా వాతావరణ సమాచారాన్ని పరిశీలించాలని  గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే  సూచించారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి మారే అవకాశం ఉన్నందున ప్రయాణ ప్రణాళికను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలన్నారు.

Advertisement

ప్రత్యేకంగా రాబోయే రెండు రోజుల్లో యాత్రకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోతే అవసరమైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం  మంచిదన్నారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనవసరమైన ఇబ్బందులను నివారించే అవకాశం ఉందన్నారు. యాత్ర సమయంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎలాంటి హెచ్చరికలు వచ్చినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా, అధికారుల సూచనల మేరకు మాత్రమే ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా కొండ మార్గాల్లో ప్రయాణించే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. అవసరమైన అన్ని శాఖలను అప్రమత్తం చేసి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.

చార్ ధామ్ యాత్ర గురించి..

Advertisement

చార్ ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అయితే, కొండ ప్రాంతాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఈసారి యాత్రకు వెళ్లే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, వెదర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారుల సూచనలు పాటిస్తూ ప్రయాణిస్తే యాత్రను సురక్షితంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

Related News

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

Big Stories

Advertisement
×