Sobhan Babu:తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడు సోగ్గాడు శోభన్ బాబు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినిమా జీవితం లో 230 పైగా సినిమాల్లో నటించారు.అలా తనదైన ప్రేమ కథ సినిమాలతో మహిళా ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న ఈ అందాల నటుడి భార్య శాంతకుమారి జులై 10న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణాలతో మరణించింది .ఈ సందర్భంగా సోగ్గాడి జీవితంలో జరిగిన జీవిత విశేషాలు మరోసారి వార్తల్లో హైలైట్ అవుతున్నాయి.
మరింతకి ఈ సోగ్గాడి జీవిత విశేషాలు ఏంటో మనమూ ఒకసారి చూసేద్దాం .శోభన్ బాబు అలియాస్ ఉప్పు శోభనా చలపతిరావు కృష్ణాజిల్లా చిన్న నందిగామలో 1937 జనవరి 14న జన్మించారు.బీఎస్సీ దాక చదివి, చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు శోభన్ బాబు.ఇక డిగ్రీ పూర్తయ్యే నాటికి ఆయన వివాహం కూడా అయిపోయింది.ఆ తర్వాత శోభన్ బాబుని ఇంజనీరింగ్ చదవాలన్న ఉద్దేశంతో అలీగడ్ యూనివర్సిటీలో ప్రయత్నాలు కూడా ప్రారంభించారు వారి పెద్దలు.
సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని గట్టి నిర్ణయం
కానీ శోభన్ బాబు మద్రాస్ లోని లా కాలేజీలో చేరితే సినిమాల్లో ప్రయత్నాలు చేయొచ్చు అన్న ఆలోచనతో ఆ విషయాన్ని తండ్రికి చెప్పారు.ఇక మద్రాస్ వెళ్తున్నానని స్నేహితులతో అంటే నీకు హీరో లక్షణాలు ఉన్నాయి అని కొంతమంది ఎంకరేజ్ చేస్తే, మరి కొంత మంది మాత్రం వందమందిలో ఒకరే సక్సెస్ అవుతారు మిగిలిన 99 మంది జీరోలె. సినిమాలు ఎందుకు నీకు చదువు పాడు చేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.కానీ శోభన్ బాబు మాత్రం కచ్చితంగా సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని గట్టి నిర్ణయం తీసుకున్నారు.అది కూడా ఉంటే గింటే హీరో గానే ఉండాలి తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదా కామెడీ ఆర్టిస్ట్ గా ఉండే ప్రసక్తే లేదని హీరోగానే రిటైర్ అయిపోయారు పోవాలని ఫిక్స్ అయ్యారు .తన తాతకి చెబితే ఎంతో ఎంకరేజ్ చేశారట .మనకు లేకపోతే అవతలి వాళ్ళు నవ్వుతారు ఉంటే అసూయపడతారు, నువ్వేం చేసినా నవ్వుల పాలు కాకుండా ఒకరు అసూయ పడేలా బతుకు.
ఇప్పటికీ చెన్నై లో సగం ఆయనేదే
తిండి దగ్గర వ్యవహారాల దగ్గర అసలు మొహమాట పడొద్దు, కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో ఏనుగు మింగిన వెలగ పండులో గుజ్జు ఎలా మాయమవుతుందో తెలియదు.డబ్బు కూడా అంతే .జాగ్రత్తగా లేకపోతే మన దగ్ముగర ఉండదు.ముఖ్యంగా ఎవరికి అప్పు ఇవ్వద్దు, ప్రాణం పోయినా అప్పు తీసుకోవద్దు. ఉన్నవాడు ఖర్చుపెట్టకపోతే పిసినారి అంటారు. అదే ఖర్చు చేసే బికారి అయిపోతే కళ్ళు నెత్తికెక్కాయిఅంటారు అంటూ తాతయ్య చెప్పిన మాటలను లైఫ్ లాంగ్ పాటించాలి శోభన్ బాబు .అలా సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బునే భూములపై పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరూహించని విధంగా ఎదిగాడు శోభన్ బాబు.ఇప్పటికీ చెన్నై లో సగం ఆయనేదే అంటుంటారు చాలా మంది.
దైవబలం సినిమాలో తొలిసారి కనిపించిన శోభన్ బాబు
ఇక కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ ఎంకరేజ్మెంట్ తో దైవబలం సినిమాలో తొలిసారి కనిపించిన శోభన్ బాబు ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలలో దాదాపు 20 సినిమాలకు పైగా చిన్న చిన్న పాత్రలో నటించారు .ఇక ఎన్టీఆర్ దగ్గరుండి మరి వీరాభిమన్యులో టైటిల్ రోల్ ఇప్పించినా అనుకున్నంత స్టార్ డం రాలేదు.ఆ తర్వాత పుణ్యవతిలో ఎన్టీఆర్ శోభన్ బాబుకు మంచి పాత్ర ఇచ్చారు .ఇక ఆ సినిమాలోనే “ఇంతేలే నిరుపేదల బ్రతుకులూ…”, “పెదవులపైన సంగీతం…”వంటి హిట్ సాంగ్స్ ఆయన పైనే షూట్ చేశారు.ఇక ఆ తర్వాత మనుషులు మారాలి సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ మాత్రం శోభన్ బాబుకి దక్కలేదు.చివరికి తాసిల్దార్ గారి అమ్మాయి సినిమాలో తండ్రి కొడుకులు గా నటించారు శోభన్ బాబు.ఆ సినిమాలో తనదైన నటనతో ఆడియన్స్ అలరించిన శోభన్ బాబు సినిమా ఒక్కసారిగా సూపర్ హిట్ అవడంతో స్టార్ గా మారిపోయాడు.
ముఖ్యంగా 1975లో శోభన్ బాబు ఒక పీక్ స్టేజ్ చూశాడు.ఆ ఏడాది ఆయన నటించిన దేవుడు చేసిన పెళ్లి, జీవనజ్యోతి, జేబుదొంగ, సోగ్గాడు అనే నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి హైదరాబాదులో డైరెక్ట్ 100 డేస్ జరుపుకోవడం ఇప్పటికి ఒక రికార్డు . నుదుటిపై రింగుపడే హెయిర్‌స్టైల్‌తో ‘రింగుబాబు’గా మహిళా ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు.అయితే సినిమాల్లో ఎంత గ్లామరస్ గా ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం సింపుల్ గా ఉండేవాడు శోభన్ బాబు. ఇక జయలలితతో ప్రేమాయణం నడిపాడన్న వార్తలు కూడా అప్పట్లో గట్టిగానే చక్కర్లు కొట్టాయి .
భగవద్గీత వినడం చాలా ఇష్టం
మీకు ఇంకో విషయం తెలుసా ఆయనకు దేవుడిపై అసలు నమ్మకం లేదట.జీవితంలో ఒక్కసారి కూడా గుడికి వెళ్లలేదట శోభన్ బాబు . అలాగని దేవుడిని నమ్మేవారిని ఎప్పుడు విమర్శించలేదు. ఆయనకు ఘంటసాల గారి భక్తి భగవద్గీత వినడం చాలా ఇష్టం .రోజుకో శ్లోకం కూడా చదివేవారట .చెన్నైలోని నుంగంబాకం రాజారాం మోహతానగర్ మెయిన్ సెంటర్లో తూర్పువైపు కార్నర్‌లో ఉన్న ఆయన నివాసంలో శాంతి, ప్రశాంతి అనే రెండు ఇల్లు ఉండేవి.శాంతి లో కుటుంబంతో నివసిస్తే, ప్రశాంతిని ఆఫీస్ పనుల కోసం, మేకప్ కోసం వాడే వాడట శోభన్ బాబు.అక్కడ మేకప్ అద్దానికి ఇరువైపులా తన చెల్లెలి, తాత ఫోటోలు పెట్టుకునే వాడట.హాల్లో దేవాలయం సినిమాలోని దశావతారాల గెటప్స్ రంగుల ఫోటోలు ఉండేవి.
ఆయన పర్సనల్ ఛాంబర్ లో దేవుడి ఫోటోలు కాకుండా గాంధీ ,ఏసుక్రీస్తు, బుద్ధుడు, మదర్ తెరిసా ఫోటోలు వరుసగా ఉండేవి.అలాగే బలరామకృష్ణులు చిత్రంలో తన పక్కన గొడుగు పట్టి చనిపోయిన ఒక జూనియర్ నటి ఫోటోను కూడా ఎంతో ఇష్టంగా దాచుకున్నాడు శోభన్ బాబు.ఇక టేబుల్ మీద ఎన్టీఆర్ ఫోటో ఖచ్చితంగా ఉండేదట .ఇక ప్రకృతిని ఎంతో ఇష్ట పడే శోభన్ బాబు. తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో బిల్డింగ్స్ కట్టకుండా చెట్లను పెంచడం విశేషం.ఇక తన ఛాంబర్ లోపల ఉన్న ఒక పెద్ద వేప చెట్టును నరకకుండా దానికి కంచే వేసి ఒక గదిని నిర్మించుకున్నాడు శోభన్ బాబు .ఇక ఎవరైనా ఆ చెట్ల ఆకుల్ని, పూలను కోస్తే కోపం వచ్చేదట .
అందాల నటుడిగా, హీరోగా మాత్రమే గుర్తుంచుకోవాలనే
వయసు మీద పడుతున్న సమయంలో తన స్టార్ డం తగ్గక ముందే సినిమాలని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు శోభన్ బాబు.అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యాక ఎంత మంది దర్శకులు ఎన్ని కోట్లు ఇస్తామన్నా, ఇంటికొచ్చి బతిమిలాడినా ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు మాత్రం మొండిగా చేయనని చెప్పేసాడు శోభన్ బాబు.తన అభిమానులు తనని అందాల నటుడిగా, హీరోగా మాత్రమే గుర్తుంచుకోవాలనేది శోభన్ బాబు ఆలోచన.ఇక అతడు సినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం త్రివిక్రమ్ ఎంత ప్రయత్నించినా నో చెప్పాడు .మురళీమోహన్ ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్ చేసిన తిరస్కరించాడు కూడా .తన చివరి రోజుల్లో మీడియా ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించినా తన ఇంటి దగ్గరకి అసలు రానివ్వలేదు శోభన్ బాబు .శోభన్ బాబు జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.సినిమాల్లో ఎంత పేద పాత్ర చేసిన ఆ పేద బట్టల్లో శోభన్ బాబు కూడా గ్లామరస్ గాని కనిపించే వారట .ఎప్పుడు డీ గ్లామర్ రోల్స్ వేయలేదు.నిజానికి థియేటర్లోకి వచ్చి జనాలు చూసేదే ఆయన గ్లామర్ ని.ఆ గ్లామర్ వల్లే ఎక్కువ సినిమాలు ఆడాయి కూడా.అయితే కెరీర్ లో ఒకే ఒక్క సినిమాలో మాత్రం నిక్కర్ వేసుకొని పూర్తి డి గ్లామర్ పాత్రలో కనిపించాడు .
ఆ సినిమా ఏంటో తెలుసా ఇప్పటికి ఎవర్గ్రీన్ గా నిలిచిన పదహారేళ్ళ వయసు .కే రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో చంద్రమోహన్ చేసిన అమాయకపు చంటిగాడు గోపాలకృష్ణ పాత్రను మొదటిగా చేయాల్సింది శోభన్ బాబు .ఈ పాత్రకు శోభన్ బాబు ఓకే చెప్పి నిక్కర్ వేసుకున్నప్పటికీ అందాలు నటుడిగా ఉన్న శోభన్ బాబుని అలా చూడటం రాఘవేంద్రరావుకు అస్సలు ఇష్టం లేక పోయింది .దీంతో అది కరెక్ట్ కాదనిపించి ఆయన వద్దకు వెళ్లి మిమ్మల్ని చూడలేం అని ఆ పాత్రని చంద్రమోహన్ ని తీసుకున్నారట రాఘవేంద్రరావు.ఇక చంద్రమోహన్ ని తీసుకున్నాక కూడా ఎక్కువ నిక్కర్ కాకుండా పంచె ని ప్లాన్ చేశారు.ఇక ఆ పాత్ర కోసం వారు కొన్న పంచే కాస్ట్యూమ్ ధర కేవలం 40 రూపాయలని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు .అలా శోభన్ బాబుని ఒక డీ గ్లామర్ పాత్రలో చూసే అవకాశాన్ని మిస్సయ్యా మన్న మాట .
1958 మే 15న శోభన్ బాబుతో పెళ్లి
ఇక ఇంతటి లెజెండరీ స్టార్ జీవితంలో కొండంత అండగా నిలిచిన ఆయన భార్య శాంతకుమారి జులై 10న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య సమస్యలతో కన్ను మూసింది.1958 మే 15న శోభన్ బాబుతో పెళ్లి అయినప్పటి నుండి ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఆమె ఎల్లప్పుడూ పబ్లిసిటీకి దూరంగా ఉండడం విశేషం.అలా సాధారణ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ భర్త కెరీర్ కి ఎంకరేజ్ చేస్తూ అండగా నిలిచింది .2008లో శోభన్ బాబు గుండెపోటుతో ఆకస్మిక చనిపోయిన తర్వాత పూర్తిగా పిల్లలతో చెన్నైలోని తన ఇంట్లో ప్రశాంతంగా గడుపుతూ వచ్చింది .ఇక ఈ దంపతులకు కుమారుడు కరుణ శేషు ,కుమార్తెలు మృదుల, ప్రశాంతి ,నివేదిత అనే నలుగురు సంతానం ఉన్నారు.ఇక శాంతకుమారి మృతదేహానికి నేడే కుటుంబ సభ్యుల మధ్యలో అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది.