E-Paper
Advertisement

వందే భారత్‌లో వీకెండ్ ట్రిప్.. ఈ 4 పుణ్యక్షేత్రాలను అస్సలు మిస్ అవొద్దు!

వందే భారత్‌లో వీకెండ్ ట్రిప్.. ఈ 4 పుణ్యక్షేత్రాలను అస్సలు మిస్ అవొద్దు!
Advertisement

Vande Bharat Weekend Pilgrimage: వీకెండ్‌లో ఎక్కడికైనా ప్రశాంతమైన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారా? అయితే, మీకు వందే భారత్ ప్రయాణం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. వేగవంతమైన ప్రయాణం, సౌకర్యవంతమైన సీట్లు, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం కలిసి వచ్చే అవకాశం. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రస్తుతం వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునేవారికి ప్రయాణం మరింత సులభమైంది. అలాంటి నాలుగు పాపులర్ రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.వారణాసి – కాశీ విశ్వనాథుడి దర్శనం

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి దేశంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి. కాశీ విశ్వనాథ ఆలయం, గంగా నది ఘాట్లు ప్రతి రోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంటాయి. న్యూఢిల్లీ నుంచి ఉదయం బయలుదేరే వందే భారత్ రైలు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటుంది. అక్కడ ఆలయ దర్శనం, గంగా హారతి చూసిన తర్వాత మరుసటి రోజు తిరుగు ప్రయాణం చేయవచ్చు. దీంతో వీకెండ్ ట్రిప్‌ కు ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

2.అయోధ్య – శ్రీరాముడి జన్మభూమి

Advertisement

రామ మందిరం ప్రారంభమైన తర్వాత అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఆనంద్ విహార్ నుంచి బయల్దేరే  వందే భారత్ రైలు మధ్యాహ్నానికి అయోధ్యకు చేరుకుంటుంది. శ్రీరామ జన్మభూమి, కొత్తగా నిర్మించిన రామ మందిరం, ఇతర ఆలయాలను సందర్శించి మరుసటి రోజు తిరిగి రావచ్చు. తక్కువ సమయంలో అయోధ్యకు వెళ్లి రావాలనుకునే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది.

3.కత్రా – వైష్ణోదేవి యాత్ర

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వైష్ణోదేవి అమ్మవారి దర్శనానికి కత్రాకు వెళ్తుంటారు. న్యూఢిల్లీ నుంచి నడిచే వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ సుమారు ఎనిమిది గంటల్లో శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్‌కు చేరుస్తుంది. అక్కడి నుంచి ఆలయాని వెళ్లొచ్చు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు సమయం కూడా ఆదా కావడంతో ఈ రూట్‌ కు మంచి డిమాండ్ ఉంది.

4.పూరీ – జగన్నాథుడి సన్నిధి

Advertisement

ఒడిశాలోని పూరీ చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడ ఉన్న జగన్నాథ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హౌరా నుంచి బయలుదేరే వందే భారత్ రైలు సుమారు ఏడు గంటల్లో పూరీ చేరుకుంటుంది. ఆలయ దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం కూడా అదే రోజు లేదంటే మరుసటి రోజు  తిరిగి వెళ్లొచ్చు.

నిజానికి వందే భారత్ రైళ్ల రాకతో ఆధ్యాత్మిక యాత్రలు గతంతో పోలిస్తే చాలా ఈజీగా మారాయి. ఎక్కువ రోజులు సెలవులు తీసుకోలేని వారు కూడా వీకెండ్‌లోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రశాంతమైన అనుభూతితో ఇంటికి చేరుకునే అవకాశం ఏర్పడింది. ఒకవేళ మీరు కూడా వీకెండ్ స్పెషల్ గా గడపాలనుకుంటే, ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని వందే భారత్‌ లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

Read Also: మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!

Related News

చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ప్రయాణానికి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ప్రయాణ సమయంలో షూస్ తీసుకెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారా? సూట్‌కేస్‌లో ఇలా ప్యాక్ చేస్తే స్థలం ఆదా

వర్షకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ కొండ ప్రాంతాలకు వెళ్తే తిరిగి రావాలనిపించదు

భారతీయులకు 56 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ.. కానీ ఇండియాలో మాత్రం ఆ కొన్ని దేశీయులకు మాత్రమే సదుపాయం

మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!

పాక్‌లో విమానం అదృశ్యం.. వీడిన మిస్టరి, వాళ్లంతా ఏమయ్యారు?

తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేసెస్!

Big Stories

Advertisement
×