E-Paper
Advertisement

మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!

మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!
Advertisement

Amazing Indian Railways Facts: ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కానీ, భారతీయ రైల్వే ఎంత పెద్ద వ్యవస్థో, రోజూ ఎన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుందో చాలా మందికి తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌ వర్క్‌ లలో ఒకటైన భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఏకంగా 741 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.54 శాతం ఎక్కువ. అంటే.. రోజుకు సగటున 2.3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారన్న మాట. ఈ సంఖ్య దాదాపు ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం కావడం విశేషం.

రోజూ 13 వేల రైళ్ల రాకపోకలు

Advertisement

దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే ప్రతి రోజు 13 వేలకుపైగా ప్రయాణికుల రైళ్లను నడుపుతోంది. ఇవి 7,325 రైల్వే స్టేషన్లను కలుపుతూ కోట్లాది మందికి సేవలు అందిస్తున్నాయి. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు ప్రజలను కలిపే ప్రధాన రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది.

68 వేల కిలో మీటర్ల రైల్వే ట్రాక్స్

భారతీయ రైల్వే ట్రాక్‌ల మొత్తం పొడవు 68 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇది భూమిని దాదాపు రెండుసార్లు చుట్టివచ్చేంత దూరం. అన్ని రైళ్లు కలిపి రోజుకు సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

కిలో మీటర్ కు 38 పైసల చెల్లింపు

Advertisement

భారతీయ రైలు ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత చౌకైనది. సగటున ఒక ప్రయాణికుడు ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 38 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాడు. అందుకే సాధారణ ప్రజలకు రైలు ఇప్పటికీ అత్యంత అందుబాటు ప్రయాణంగా  కొనసాగుతోంది.

53 శాతం మంది సబర్బన్ ప్రయాణికులు

భారతీయ రైల్వే ప్రయాణికుల్లో 53 శాతం మంది సబర్బన్ ప్రయాణికులే. వీరు తక్కువ ఛార్జీలు చెల్లిస్తూ ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం ప్రయాణిస్తుంటారు. అయితే, మొత్తం ఆదాయంలో వీరి వాటా మాత్రం చాలా తక్కువ కావడం విశేషం.

శరవేగంగా రైల్వే అభివృద్ధి

సాంకేతికంగా భారతీయ రైల్వే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు, 72 అమృత్ భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఒకే యాజమాన్యం కింద నడిచే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. ప్రతి రోజు కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా నిలుస్తోంది. అందుకే భారతీయ రైల్వేను దేశానికి జీవనాడిగా పిలుస్తారు.

Read Also: ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Related News

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

Big Stories

Advertisement
×