E-Paper
Advertisement

ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి, ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో ఐదురోజులు ఉక్కపోత

ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి,  ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో  ఐదురోజులు ఉక్కపోత
Advertisement

Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో అందుకు పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులు తెలంగాణలో ఉక్కుపోత ఖాయగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశంలో విచిత్ర వాతావరణం-ఓ వైపు నైరుతి రుతుపవనాలు.. మరోవైపు ఎల్ నినో కారణంగా వాతావరణంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాయువ్య భారతంలో అల్పపీడనం-రుతుపవన ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Advertisement

ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి-దక్షిణాదిలో అప్పుడు ఉక్కపోత మొదలైంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రకరకాల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలో సగానికి పైగానే ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ ప్రాంతంలో రుతు పవనాలు విరామం తీసుకున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

ఐదురోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్-జూన్ 10 అనగా శుక్రవారం వచ్చే బుధవారం అనగా 15 వరకు తెలంగాణలో రుతుపవనాల విరామ పరిస్థితులు మొదలుకానున్నట్లు అంచనా వేసింది.  ఫలితంగా నేటి నుంచి ఐదు రోజులపాటు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. జూలై 12 నుంచి 15 మధ్య తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీలు, హైదరాబాద్ సిటీలో 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

వెంటాడుతున్న వర్షపాతం లోటు-వేడి కారణంగా అక్కడక్కడా కొన్ని వర్షాలు పడే అవకాశముందని, జూలై నెల సాధారణ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే చాలా స్వల్పంగా ప్రస్తావించింది. ఒకటి రెండు చోట్ల తప్పా తెలంగాణ అంతటా వాతావరణం దాదాపు పొడిగా ఉంటుందని అంచనా వేసింది.

ALSO READ: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా? 

కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రస్తావించింది. దేశంలో రుతుపవన వర్షపాత లోటు 60 శాతం దాటింది. దీంతో రైతుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అంతేకాదు వ్యవసాయం, గ్రామీణ ఆదాయాలపై భయాలు మొదలయ్యాయి.

 

 

Related News

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Telangana Sports: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!

Basti Dawakhanas: ఈ నెల 10వ తేదీ నుంచే అసలైన ఆట.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!

Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు

Big Stories

Advertisement
×