Indian Railways Alcohol Rules: రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, ముందు కొన్ని కీలక నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, రైలులో మద్యం తీసుకెళ్లడంపై దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పరిమితులు, నియమాలు లేవు. ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారు? ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తున్నారు? చివరికి ఎక్కడ దిగుతున్నారు? అనే విషయాలపై రూల్స్ ఆధారపడి ఉంటాయి. మద్యం విషయంలో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు ఎక్సైజ్ చట్టాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నిర్ణీత పరిమాణంలో సీల్ చేసిన మద్యం సీసాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే, మరికొన్ని రాష్ట్రాల్లో మద్యం కలిగి ఉండటం, రవాణా చేయడంపై కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి.
అలాంటి నిబంధన ఏమీ లేదు. సీల్ చేసిన మద్యం సీసా ఉన్నంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో దాన్ని తీసుకెళ్లడం చట్టబద్ధం కాదు. బీహార్, గుజరాత్ వంటి మద్యపాన నిషేధ చట్టాలు అమలులో ఉన్న రాష్ట్రాల్లో మద్యం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మద్యం చట్టబద్ధంగా కొనుగోలు చేసినా, నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలోకి దానిని తీసుకెళ్లడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు.
మద్యం సీసా తీసుకెళ్లడం వేరు, రైలులో మద్యం తాగడం వేరు. రైలు ప్రయాణంలో మద్యం సేవించి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 145 ప్రకారం రైల్వే ప్రాంగణంలో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.500 వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు.
ప్రయాణ సమయంలో సీల్ తీసిన మద్యం సీసా ఉండటం పరిస్థితిని మరింత సీరియస్ గా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యం సేవిస్తూ కనిపించినా, మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించినా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. రైల్వే పోలీసులు, RPF అధికారులు పరిస్థితిని బట్టి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అందువల్ల రైలు ప్రయాణంలో మద్యం సేవించకుండా ఉండటం సురక్షితమైన మార్గం.
ఢిల్లీ మెట్రోలో అమలయ్యే మద్యం నిబంధనలు భారతీయ రైల్వేకు వర్తించవు. ఢిల్లీ మెట్రో కొన్ని షరతులతో సీల్ చేసిన రెండు మద్యం సీసాల వరకు అనుమతించినప్పటికీ, అది కేవలం మెట్రో వ్యవస్థకు మాత్రమే వర్తిస్తుంది. మద్యం తీసుకెళ్లే విషయంలో సీసాల సంఖ్యతో పాటు వయస్సు కూడా ముఖ్యమే. మేజర్లు మాత్రమే మద్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ప్రయాణానికి ముందు సంబంధిత రాష్ట్రాల నియమాలను తెలుసుకోవడం మంచిది.
Read Also: ఈ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!