Shakeel: కల్వకుంట్ల కవితపై మాజీ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేసారు. కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాంమన్నారు కానీ బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామంటే మాత్రం ఊరుకోం అని షకీల్ అన్నారు. కవిత వ్యాఖ్యలు అత్యంత బాధాకరం, అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.
సీనియర్ బీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడాలని, బీఆర్‌ఎస్‌పై అక్కసు ఎందుకు? అని కవితపై ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెడితే ప్రజలు ఆదరించరని, కవిత కన్నీళ్లు వ్యక్తిగత, కుటుంబ సమస్యలే షకీల్ అన్నారు.
Also read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!
కుటుంబ విషయాలను రాజకీయ వేదికపైకి తేవడం సరికాదన్నారు. బోధన్ నుంచి కవిత పోటీ చేస్తే మోస్ట్ వెల్‌కమ్ చేస్తామని మాజీ ఎమ్మల్యే షకీల్ తెలిపారు. కవిత బోధన్ కోడలు పోటీ చేస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతామని అన్నారు. బోధన్ గడ్డపై ప్రజల తీర్పు ఏంటో కవితకు తెలుస్తుందని షకీల్ క్లారిటీ ఇచ్చారు.
Also read: హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!