Indian Railways: ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన సంస్థగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. దేశంలో విమాన ప్రయాణాలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, రైలు ప్రయాణం చేసేందుకే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, రైలు ప్రయాణం చేసే సమయంలో కొన్ని టిప్స్ పాటిచడం వల్ల మరింత హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ లగేజీని జాగ్రత పరుచుకోవాలి
రైల్లోకి అడుగు పెట్టగానే మీ లగేజీని భద్రపరుచుకోవాలి. మీ సామాను చోరీకి గురి కాకుండా ఉండేందుకు మీకు కేటాయించిన స్థలంలో లగేజీని సేఫ్ గా లాక్ చేసుకోవాలి. అప్పుడే, జర్నీ సాఫీగా ముందుకు సాగుతుంది.
⦿ ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేసుకోండి
భారతీయ రైల్వే సంస్థ రైలులో ఫుడ్ అందిస్తున్నప్పటికీ చాలా మంది బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు ఇష్టపడుతారు. స్విగ్గీ సహా పలు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకుంటారు. మీరు కూడా రైలు ప్రయాణంలో నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోండి. ఆ ఫుడ్ ను తింటూ హాయిగా ముందుకు జర్నీ చేయండి. అయితే, రైల్వే ప్రయాణంలో నాన్ వెజ్ ఫుడ్ కంటే వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం మంచిది.
⦿ పక్కవారిని నుంచి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి
రైలు ప్రయాణం చేసే సమయంలో కొంతమంది హాయిగా నిద్రపోవాలి అనుకుంటారు. అదే సమయంలో తోటి ప్రయాణీకులు పెద్ద పెద్దగా సౌండ్ చేస్తే, మీరు ఇయర్ ప్లగ్స్ ఉపయోగించండి. ఇంకా కళ్లకు లైటింగ్ తగలకుండా ఐ మాస్క్ వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఇతరుల నుంచి ఇబ్బంది కలగకుండా హ్యపీగా నిద్రపోయేలా చేస్తుంది.
⦿ ఎక్కువ ఫుడ్ అందుబాటులో ఉండేలా చూసుకోండి
కొన్నిసార్లు రైలు ప్రయాణం అనుకున్న సమయాని కంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది కలగకుండా అదనంగా వాటర్ బాటిళ్లు, స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా బిస్కెట్స్ క్యారీ చేయడం వల్ల వేడి వేడి టీలో ముంచుకుని తినడానికి అనుకూలంగా ఉంటాయి.
⦿ బోర్ కొట్టకుండా బుక్స్ చదవండి!
కొన్నిసార్లు ట్రైన్ జర్నీ చాలా సమయం పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒంటరిగా ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వీలైనంత వరకు బుక్స్ చదివేందుకు ప్రయత్నించండి. పుస్తకం చదవడం వల్ల ఎలాంటి బోర్ లేకుండా జర్నీ కొనసాగే అవకాశం ఉంటుంది. లేదంటే, రైలు ప్రయాణ మార్గంలో అందమైన ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేయండి. కాదంటే… మీకు నచ్చిన సినిమాలను ల్యాప్ టాప్ లో లేదంటే ఫోన్ లో చూస్తూ హ్యాపీగా జాలీగా జర్నీ చేయండి. రైలు ప్రయాణంలో తోటి ప్రయాణీకులతో స్నేహం చేసుకునే అవకాశం ఉంటుంది. వారితో సరదాగా గడుపుతూ జర్నీ చేయవచ్చు.
Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!