Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా లోని ఓ ఎయిర్ పోర్ట్ లో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ ఎయిర్ పోర్ట్ లో స్థానిక మీడియా ప్రతినిధులతో {Virat Kohli} వాగ్వాదానికి దిగాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ని ఎయిర్ పోర్టులో అక్కడి జర్నలిస్టులు కొందరు ఇంటర్వ్యూ చేస్తుండగా.. హోటల్ రూమ్ కి వెళుతున్న విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలు అకాయ్, కూతురు వామికలతో కలిసి అటువైపు నుండి వచ్చాడు. ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులు కోహ్లీ కుటుంబం ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు.
Also Read: Team India WTC Schedule: WTC 2025-2027 టోర్నమెంట్ టీమిండియా షెడ్యూల్ ఇదే ?
దీంతో తన కుటుంబ సభ్యులను ఫోటోలు తీయవద్దని కోహ్లీ {Virat Kohli} ఎంత చెప్పినా వినకుండా అక్కడి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దీంతో కోహ్లీకి ఒక్కసారిగా పట్టలేనంత కోపం వచ్చింది. ఫోటోలు ఎందుకు తీస్తున్నారని వారితో గొడవకు దిగాడు కోహ్లీ. తన అనుమతి లేకుండా తన పిల్లల ఫోటోలు ఎలా తీస్తారని ఓ మహిళా జర్నలిస్టుతో విరాట్ వాగ్వాదానికి దిగాడు. ” నా పిల్లల విషయంలో నాకు గోప్యత కావాలి. నా పర్మిషన్ లేకుండా మీరు ఫోటోలు తీయొద్దు ” అంటూ జర్నలిస్టులతో గొడవకి దిగాడు. అంతేకాదు ఓ మీడియా ప్రతినిధి దగ్గరికి వెళ్లి వారు తీసిన ఫోటోలు, వీడియోలు చూపించాలని కోరాడు.
తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు ఉంటే డిలీట్ చేయాలని {Virat Kohli} సూచించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టెస్ట్ డ్రా కాగా.. ఈ సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో సమానంగా నిలిచాయి. ఇక 4 వ టెస్ట్ మేల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుండి ప్రారంభం కాబోతోంది. ఈ నాలుగవ టెస్ట్ కోసం టీమ్ ఇండియా గురువారం గబ్బా నుండి మెల్ బోర్న్ కి చేరుకుంది. ఇక్కడి విమానాశ్రయానికి కోహ్లీ తన కుటుంబంతో చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
దీంతో కోహ్లీ {Virat Kohli} సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఫ్యామిలీతో బయలుదేరిన సందర్భంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి సంఘటనే కోహ్లీకి ఎదురైంది. ముంబై ఎయిర్పోర్ట్ లో కోహ్లీని తన కుటుంబంతో కలిసి చూసేసరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో అభిమానుల తాకిడి పెరగడం వల్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. తన పిల్లల ఫోటోలు తీయకూడదని అభిమానులను రిక్వెస్ట్ చేశాడు.
కానీ వారు వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మీ అందరితో సెల్ఫీలు తీసుకుంటూ {Virat Kohli} నా కుటుంబంతో నేను ఇక్కడే వేచి ఉండాలా అని ఫైర్ అయ్యాడు. ఇక తన పిల్లల విషయంలో విరాట్ చాలా గోప్యతగా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పుడైనా సోషల్ మీడియాలో తన పిల్లల ఫోటోలను పోస్ట్ చేస్తే ముఖాలు కనిపించకుండా ఎమోజీలు ఉంచుతాడు. తన పిల్లలను మీడియాకు దూరంగా పెంచాలనుకుంటున్నామని ఇప్పటికే మీడియా ఛానల్లకి కూడా విరుష్క దంపతులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లీ వాగ్వాదం
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో స్థానిక మీడియా ప్రతినిధులతో కోహ్లీ గొడవ
హోటల్ రూమ్‌కు వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించిన మీడియా
తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని ఓ మహిళా జర్నలిస్టుతో… pic.twitter.com/9N2uXkCdLL
— BIG TV Breaking News (@bigtvtelugu) December 19, 2024