BigTV English

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Free Wi-Fi:  రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

India Railway Free Wi-Fi:  భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా వేలాది రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు రైల్వే స్టేషన్లు అత్యాధునిక హంగులను అద్దుకుంటున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి, కాచిగూడ, సికింద్రాబాద్‌ సహా దేశంలని 6,115 రైల్వే స్టేషన్లలో సహా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.


రైల్ టెల్ సహకారంతో వైఫై సేవలు

రైల్వే ప్రయాణీకులు భారతీయ రైల్వే కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా వైఫై సేవల గురించి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అడిగి ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇంచుమించు అన్ని రైల్వే స్టేషన్లలో వై-ఫై సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని సాయంతో ప్రయాణికులు సినిమాలు, పాటలు, గేమ్స్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు. కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితులలో స్టేషన్‌ పరిసరాల్లో కూర్చొని  ఆఫీస్‌ వర్క్‌ కూడా చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక ఈ వైఫై సేవలను రైల్వే సహకార సంస్థ  రైల్‌ టెల్‌  సహకారంతో అందిస్తున్నట్లు తెలిపారు. “భారతీయ రైల్వేలలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు ఉన్నాయి. కొన్ని చోట్ల 5జీ, మరికొన్ని చోట్ల 4జీ సేవలు అందిస్తున్నాం. ఈ సర్వీసుతో ప్రయాణాకులు రైల్వే స్టేషన్లలో హ్యాపీగా సినిమాలు చూడ్డం, పాటలు వినడం, గేమ్స్ ఆడటం లాంటివి చేసుకోచ్చు. అవసరం అనుకుంటే ఆఫీస్ వర్క్ కూడా చేసుకునే అవకాశం ఉంది” అని రైల్వే మంత్రి తెలిపారు.


Read Also: నిద్రపోయే రాష్ట్రం.. దేశంలోనే చాలా భిన్నం, ఎందుకంటే?

సింపుల్ గా రైల్వే స్టేషన్ లో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు!   

రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత Wi-Fi సేవలను ప్రయాణీకులందరికీ అందుబాటులో ఉంచినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.  రైల్వే స్టేషన్‌లో వైఫైని సింపుల్ గా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. “ ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో వైఫై ని ఆన్ చేయాలి. RailWire వైఫై నెట్‌ వర్క్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, SMS ద్వారా ఓటీపీని పొందాలి.  OTP ని ఎంటర్ చేసిన వెంటనే హై స్పీడ్ వైఫైని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.  రైల్వే స్టేషన్లలో వై ఫై సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌ టెల్ అందిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.  ప్రయాణీకులు ఈ వైఫై సేవలను వినియోగించుకుంటూ చక్కటి ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చన్నారు.

Read Also:అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Related News

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Sleeping State of India: నిద్రపోయే రాష్ట్రం.. దేశంలోనే చాలా భిన్నం, ఎందుకంటే?

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Big Stories

×