Viral Video: వ్యాపారం మొదలు పెట్టడమే కాదు, దాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలి. కస్టమర్లను ఆర్షించే ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తూ లాభాల బాటపట్టించాలి. అయితే, ఆ ప్రొడక్టులు జనాల్లో ఆదరణ పొందేలా ఉండాలే తప్ప, అపహాస్యానికి గురయ్యేలా ఉండకూడదు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఓ కంపెనీ ఏకంగా ‘రైసం రైస్ పాప్సికల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రసం రైస్ పాప్సికల్ ఏంట్రా బాబూ!
రసం రైస్ గురించి మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండియాలో ఈ ఫుడ్ చాలా ఫేమస్. జనాలు ఈ ఫుడ్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రసం రైస్ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఈ ప్లేవర్ ను ఏకంగా పాప్సికల్ రూపంలో తీసుకురావాని ఓ ఐస్ క్రీమ్ కంపెనీ ఆలోచించింది. ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఏకంగా రసం రైస్ లాంటి ప్లేవర్ పాప్సికల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల్లో పాపులర్ అయ్యేందుకు జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. సదరు కంపెనీ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ పాప్సికల్ కు సంబంధించిన పోస్టర్లు, పాంప్లెంట్స్, రోడ్ సైడ్ యాడ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ అసాధారణ ప్రొడక్ట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also: నీతా అంబానీ స్పెషల్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
రసం రైస్ పాప్సికల్ పై నెటిజన్ల క్రేజీ కామెంట్స్
రసం రైస్ పాప్సికల్ పై పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. అసలు ఇలాంటి ఐడియా వచ్చిన వాడికి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలంటున్నారు. “బహుశ రసం రైస్ ను మిక్సిపట్టి ఐస్ లా గడ్డ కట్టించారేమో?” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “రసం లేదు, రైస్ లేదు, జస్ట్ రసం ప్లేవర్ పౌడర్ కలిపి ఉంటారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఐస్ క్రీమ్ లు కూడా ఇక సంప్రదాయ రసం రైస్ రూపాన్ని పొందండం సంతోషంగా ఉంది. ఇకపై సంప్రదాయ ఐస్ క్రీమ్ అని పిలిస్తే సరిపోతుందేమో?” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇప్పటి వరకు రసం రైస్ తిన్నాం. ఇకపై చీకాలి” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Read Also: అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!