BigTV English

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Air India: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీ- వాషింగ్టన్ డీసీ మధ్య తన సేవలను నిలిపివేస్తున్నట్లు  ప్రకటించింది. ఆపరేషనల్ ఫ్యాక్టర్స్ కారణంగ కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన పలు బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమానాలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ రూట్ లో ప్రయాణించే విమానాలకు సంబంధించి పూర్తి తనిఖీలు, అప్ గ్రేడ్స్ తర్వాతే విమాన రాకపోకలకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి విమానాల సస్పెన్షన్ అమలులోకి వస్తుందని తెలిపింది. ఎయిర్ ఇండియా విమానాలలో ప్రణాళికాబద్ధమైన కొరత కారణంగా ఈ సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఎయిర్‌ లైన్ గత నెలలో బోయింగ్ 787-8 విమానాలలో 26 విమానాలను రీట్రోఫిట్ చేయడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలిపింది. ఈ రెట్రోఫిట్ కార్యక్రమం కస్టమర్ల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.


పాకిస్తాన్ గగనతం మూసివేతతో మరింత భారం

పాకిస్తాన్‌పై గగనతలం మూసివేయడం కూడా ఎయిర్ ఇండియాకు చెందిన సుదూర విమానాలపై ప్రభావం చూపింది.  పాకిస్తాన్‌పై గగనతలం మూసివేయడంతో ఎయిర్‌ లైన్  సుదూర కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. దీని వలన ఎక్కువ విమాన రూటింగ్స్, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది.


ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా కీలక అలర్ట్

సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డిసికి, అక్కడి నుంచి ఇండియాకు రాకపోకలు కొనసాగించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు కీలక అలర్ట్ జారీ చేసింది. వారికి ఇతర విమానాలలో రీబుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.   ప్రయాణీకులు ఇండియా నుంచి వాషింగ్టన్ డిసికి నాలుగు యుఎస్ గేట్‌ వేలు – న్యూయార్క్, న్యూవార్క్, చికాగో,  శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ లైన్ ఇంటర్‌ లైన్ భాగస్వాములు అయిన, అలాస్కా ఎయిర్‌ లైన్స్, యునైటెడ్ ఎయిర్‌ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ ద్వారా వన్ స్టాప్ తో అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.  ఎయిర్ ఇండియా ఇండియా నుంచి కెనడాలోని టొరంటో, వాంకోవర్‌ తో సహా ఉత్తర అమెరికాలోని ఆరు గమ్యస్థానాల మధ్య నాన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది.

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా,  డిసెంబర్ 2022లో ప్రకటించిన $400 మిలియన్ల ఫ్లీట్ రెట్రోఫిట్ ప్రోగ్రామ్ కింద మొదటి లెగసీ డ్రీమ్‌ లైనర్ రెట్రోఫిట్‌ ను ప్రారంభించినట్లు తెలిపింది.  విశ్వసనీయత పెరుగుదల కార్యక్రమంలో భాగంగా, 26 లెగసీ B787-8 విమానాల ఏవియానిక్స్, ఇతర కీలకమైన భాగాలను తాజా ప్రమాణాలకు అనుగుణంగా అప్‌ గ్రేడ్ చేయించనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.  ఆ తర్వాత విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

జూన్ 12న ఘోర ప్రమాదం

లండన్‌ కు వెళ్లే ఎయిర్‌లైన్స్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో అహ్మదాబాద్‌ లో కూలిపోయిన రెండు నెలల తర్వాత ఈ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. జూన్ 12న జరిగిన ప్రమాదంలో 241 మంది చనిపోయారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

Read Also: నిద్రపోయే రాష్ట్రం.. దేశంలోనే చాలా భిన్నం, ఎందుకంటే?

Related News

Sleeping State of India: నిద్రపోయే రాష్ట్రం.. దేశంలోనే చాలా భిన్నం, ఎందుకంటే?

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Big Stories

×