Air India Express: సమయం, సందర్భం వచ్చిందంటే చాలు చాలా కంపెనీలు బ్రహ్మాండమైన ఆఫర్లు ఇస్తుంటాయి. ఈ విషయంలో విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఓ అడుగు ముందు ఉందని చెప్పవచ్చు. తాజాగా ప్రయాణికులకు బంపరాఫర్ ఇచ్చింది. కేవలం నాలుగు రోజులు మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ ప్రయాణికులకు బంపరాఫర్ ఇచ్చింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్రీడమ్ సేల్ పేరుతో దేశీయ-అంతర్జాతీయ టికెట్లపై భారీ తగ్గింపు ఇచ్చింది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 15 వరకు మాత్రమే. ఏ మాత్రం ఆలస్యం చేసినా తక్కువ ధరతో విమానంలో ఎంచక్కా ప్రయాణించవచ్చు.
సేల్‌లో భాగంగా దేశీయ ప్రయాణానికి టికెట్ ధరను కేవలం రూ.1,279గా డిసైడ్ చేసింది. అదే విదేశాలకు అయితే 4279 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్‌లో భాగంగా మొత్తం 50 లక్షల సీట్లను అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 10 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్ పోర్టర్, యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
నేటి నుంచి అంటే ఆగస్టు 11 నుంచి అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది ఆగస్టు 19-2026 మార్చి 31 మధ్య ఎప్పుడైనా ట్రావెల్ చేయవచ్చు. ప్రయాణానికి చాలా కాలం అవకాశం ఉండడంతో దసరా, ఓనం, దీపావళి, క్రిస్మస్ లాంటి ఫెస్టివల్‌కు ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు ట్రావెలర్లు.
ALSO READ: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980 లకే టూర్, ఇంకెందుకు ఆలస్యం
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ ఛార్జీల విషయంలో ప్రత్యేకంగా ఆప్షన్లను అందిస్తోంది. క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే వారి కోసం ఎక్స్‌ప్రెస్ లైట్ పేరుతో జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ చెక్-ఇన్ బ్యాగేజీతో ప్రయాణించాలనుకునే వారికి ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ ఛార్జీలు ఉండనున్నాయి.
దేశీయంగా అయితే రూ.1,379, అంతర్జాతీయంగా రూ.4,479 నుంచి మొదలు కానున్నాయి. ప్రీమియం సేవలు కోరుకునే వారికి ఎక్స్‌ప్రెస్ బిజ్ పేరుతో బిజినెస్ క్లాస్ సీట్లను అందిస్తోంది. ఈ సంస్థ ఇటీవల కొనుగోలు చేసిన 40కి పైగా కొత్త విమానాల్లో ఆయా సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ 116 విమానాలతో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. దేశీయంగా 38, అంతర్జాతీయంగా 17 విమాన సేవలు ఉన్నాయి. ప్రతీ రోజూ 500కు పైగా విమాన సర్వీసులను ఈ సంస్థ నడుపుతోంది.
5 million seats on offer this #FreedomSale! 🎉Celebrate the freedom to explore and create #MeaningfulConnections.
💺 Domestic fares from ₹1279
🌏 International fares from ₹4279
📅 Book by 15 Aug 2025 and travel till 31 Mar 2026#FlyAsYouAre and unlock member-exclusive perks… pic.twitter.com/6LLeBefKZO— Air India Express (@AirIndiaX) August 9, 2025