BigTV English

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

2024 Aviation Stats: ఒకప్పుడు విమానం ఎక్కాలంటే చాలా డబ్బులు ఉండాలనే ఆలోచన ఉండేది. కానీ, ఇప్పుడు చీప్ గా ఎయిర్ ట్రావెల్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి విమానయాన సంస్థలు. అమెరికా లాంటి దేశాల్లో సాధారణ ప్రయాణాలకు కూడా ఎయిర్ ట్రావెల్ నే ఎంచుకుంటున్నారు. ఇక 2024లో అత్యధిక విమాన ప్రయాణాలు చేసిన దేశాలు ఏవి? ఎక్కువ మంది వెళ్లి డెస్టినేషన్ ఏది? అనే వివరాలను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌ పోర్ట్ అసోసియేషన్ (IATA)  విడుదల చేసింది. 2024 వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌ పోర్ట్ స్టాటిస్టిక్స్ నివేదికను రిలీజ్ చేసింది. ఇందులో పలు ఆసక్తికర వివరాలను పొందు పరిచింది.


ప్రపంచంలో ఎక్కువ మంది విమాన ప్రయాణాలు చేసిన దేశాలు

యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్ ను కలిగి ఉంది. 2024లో ఏకంగా 876 మిలియన్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్ చేసిన దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. అంతేకాదు, దేశీయంగా ఎక్కువ విమానాలు నడుపుతున్న దేశం కూడా అమెరికానే. భారత్ తో పోల్చితే విమానయాన మార్కెట్ నాలుగు రెట్లు ఎక్కువ. ఇక 2024లో 741 మిలియన్ల మంది ప్రయాణికులతో చైనా రెండో స్థానంలో ఉంది. 2023తో పోల్చితే 2024లో ఏకంగా 18.7% వృద్ధిని సాధించింది. ఇక యునైటెడ్ కింగ్‌ డమ్ కేవలం 94,000 చదరపు మైళ్ల ద్వీప దేశం అయినప్పటికీ, ప్రపంచంలోనే విమానయాన మార్కెట్ లో మూడో స్థానాన్ని కలిగి ఉంది. 2024లో 261 మిలియన్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు. నాలుగో స్థానంలో స్పెయిన్ ఉంది. ఇక్కడ గత ఏడాది ఏకంగా 241 మిలియన్ల మంది విమాన ప్రయాణం చేశారు. వెకేషన్ హాట్ స్పాట్‌ అయిన ఈ దేశానికి ఎంతో మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు.


అత్యంత రద్దీగా ఉండే విమాన మార్గాలు

IATA నివేదిక ప్రకారం ప్రపంచంలోని 10 అత్యంత రద్దీగా ఉండే విమాన మార్గాలలో తొమ్మిది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నాయి.   ప్రపంచంలోనే నంబర్ 1 దక్షిణ కొరియా నిలిచింది. ఇక్కడ  ఐలాండ్ రిసార్ట్ నగరం జెజుకు ఎంతో మంది పర్యాటకు తరలి వస్తున్నారు. రాజధాని సియోల్ నుంచి అక్కడికి కేవలం 1 గంట 15 నిమిషాల ప్రయాణం. 2024లో 13 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇక్కడికి వచ్చారు.

ఇక ఉత్తర అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో న్యూయార్క్ నుంచి లాస్ ఏంజిల్స్ నిలిచాయి. ఈ నగరాలకు గత సంవత్సరం 2.2 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు.  అత్యంత ప్రజాదరణ పొందిన యూరోపియన్ మార్గం   బార్సిలోనా,  పాల్మా డి మల్లోర్కా. ఈ రెండు నగరాల మధ్య గంటసేపు ప్రయాణం ఉంటుంది. 2024లో 2 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. లాటిన్ అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే మార్గం (3.8 మిలియన్ల మంది ప్రయాణికులతో) కొలంబియా రాజధాని బొగోటా (BOG)- మెడెల్లిన్ (MDE) మధ్య ఒక గంట విమాన ప్రయాణం ఉంటుంది. ఇక 3.3 మిలియన్ల మంది ప్రయాణికులతో ఆఫ్రికాలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం కేప్ టౌన్ (CPT)- జోహన్నెస్‌బర్గ్ (JNB)గా నిలిచింది.  ఇక ప్రపంచం ఎక్కువగా ఇష్టపడే డెస్టినేషన్స్ రోమ్ కింద ఉన్న రహస్య సొరంగ నగరం, రైళ్లు గోడల గుండా వెళ్ళే చైనా 8D నగరం నిలిచాయి.

Read Also: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

 

Related News

Moscow – Indian Tourists: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?

Benefits of Train Ticket: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Goa history: ఏంటీ.. గోవాలో ఉన్నది రెండే జిల్లాలా? వీటిలో ఏది బెస్ట్?

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Dussehra 2025: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!

Indian Railways Staff: 80 రూపాయల థాలీని రూ. 120కి అమ్ముతూ.. అడ్డంగా బుక్కైన రైల్వే సిబ్బంది!

Big Stories

×