Aamir khan in Coolie : కూలీపై వస్తున్న వార్తలు చూస్తే రోజు రోజుకు హైప్ భారీగా పెరిగిపోతుంది. ఒక్కో సందర్భంలో ఈ సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన వారి గురించి లీక్స్ వస్తునే ఉన్నాయి. దీంతో సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది. దీంతో వార్ 2 లాంటి బాలీవుడ్ మూవీ కూడా కూలీకి తలొగ్గాల్సి వస్తుంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న అమీర్ ఖాన్ పాత్రపై ఇప్పుడు లీక్స్ వస్తున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై బజ్ మరింత పెరిగిపోయింది. అమీర్ ఖాన్ పాత్రపై వచ్చిన లీక్స్ ఏంటి ? దానికి సూర్య రోలెక్స్ పాత్రకు ఉన్న లింక్ ఏంటి ? అనేవి ఇప్పుడు చూద్దాం.
లోకి యూనివర్స్ అంటేనే చాలా స్పెషల్. దానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ యూనివర్స్‌లో వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్టే. రాబోయే సినిమాలపై కూడా అంతే అంచనాలు, హైప్ ఉంటుంది.
అయితే అలాంటి డైరెక్టర్, రజనీకాంత్‌తో చేస్తే.. రిజెల్ట్ ఊహాలకు కూడా అందదు కదా . ఇప్పుడు కూలీకి అదే జరుగుతుంది. నార్మల్‌గా రజనీకాంత్ మూవీ అంటేనే జనాలు సెలవులు పెట్టి మరీ చూస్తారు. అలాంటిది రజనీకాంత్‌కు తోడుగా.. లోకేష్ కనగరాజ్ ఉంటే.. బాక్సాఫీసులు బద్దలే అని అంటున్నారు అభిమానులు.
ఒక్కో ఇండస్ట్రీలో ఒక్క స్టార్
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్‌తో పాటు ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ఉన్నాడు. తెలుగు నుంచి కింగ్ నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ ఉన్నాడు. కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేస్తున్నాడని ఇప్పటికే ప్రకటించారు మూవీ టీం. అలాగే పూజా హెగ్గే కూడా కీలక పాత్ర చేస్తుంది.
అమీర్ ఖాన్ పాత్ర…
విలన్‌గా నాగార్జున చేస్తున్నాడు. దీనిపై ఓ క్లారిటీ ఉంది. పూజా హెగ్డే కూడా తన పాత్ర గురించి కొన్ని ఇంటర్వ్యూలో చిన్న క్లారిటీ ఇచ్చింది. కానీ, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పాత్రపై ఇప్పటి వరకు ఎలాంటి క్లూ రాలేదు. కానీ, ఇటీవల వచ్చిన ట్రైలర్ లో మాత్రం ఆయనపై వచ్చిన యాక్షన్ సీన్స్ అయితే సూపర్బ్ అనిపించాయి.
అమీర్ పాత్రపై లీక్స్…
అయితే తాజాగా, అమీర్ ఖాన్ పాత్రపై లీక్స్ వస్తున్నాయి. ఆ లీక్స్ ప్రకారం.. కూలీ సినిమాలో దహా అనే పాత్రలో అమీర్ ఖాన్ కనిపించబోతున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది. అయితే, ఈ పాత్రకు సంబంధించి ఇంకా చాలా విషయాలను లోకేష్ కనగరాజ్ దాచిపెట్టారని తెలుస్తుంది. అయితే, ఈ పాత్ర అచ్చం.. విక్రమ్ సినిమాలో రోలెక్స్‌ను పోలి ఉంటుందట. అంత కంటే స్ట్రాంగ్‌గా కూడా ఉంటుందట. అందుకే ఆ పాత్రకు అమీర్ ఖాన్ అంగీకరించాడు అని తెలుస్తుంది.
అమీర్ ఖాన్ పాత్ర.. క్లైమాక్స్‌లో వస్తుందట. చాలా హింసతో కూడిన ఆ పాత్ర.. అప్పట్లో విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రను మించి ఉంటుందట. అదే జరిగితే… విక్రమ్ మూవీ కంటే భారీ హిట్ అవ్వడం పక్కా.. అని చెప్పొచ్చు.