kanhvi kapoor (1)
Janhvi Kapoor Stunning With Traditional Look: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ,తెలుగులో దూసుకుపోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
kanhvi kapoor (2)
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఆమె తెలుగు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో దేవర సినిమాకు సంతకం చేసి సర్ప్రైజ్ చేసింది.
kanhvi kapoor (3)
ప్రస్తుతం తెలుగులో దేవర 2, ఆర్సీ16 చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు హిందీలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇక జాన్వీ స్టైల్, ఫ్యాషన్ గురించి తెలిసిందే. డిఫరెంట్ స్టైల్, ఫ్యాషన్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది.
kanhvi kapoor (4)
ట్రెండీ వేర్, డిజైనర్ వేర్‌లోనే కాదు అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో మెరుస్తుంది. ఇటీవల పూల డిజైన్ చీరలో మెరిసిన జాన్వీ.. తాజాగా ట్రెడిషనల్ వేర్లో అచ్చతెలుగు అమ్మయిలా ముస్తాబైంది. గోల్డ్ కలర్ ఫ్యాన్సీ చీరకట్టి.. బుట్టలు, కొప్పు వేసింది.
kanhvi kapoor (5)
మల్లెపూలు పెట్టి సంప్రదాయ లుక్‌లో తళుక్కుమంది. ప్రస్తుతం జాన్వీ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫీలింగ్ సుందరి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
kanhvi kapoor (6)
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేస్తుందటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెంటర్ఆఫ్ అట్రాక్షన్ నిలిచాయి.
kanhvi kapoor (7)
సంప్రదాయ పద్దతిలో తెలుగు అమ్మాయిలా ముస్తాబైన జాన్వీ చూసి పరంసుందరి అంటూ పాటలు పాడేస్తున్నారు కుర్రకారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.