Kusal Perera Injury : సాధారణంగా ఈ మధ్య కాలంలో క్రికెటర్లకు ఎక్కువగా గాయాలవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లను పరిశీలించినట్టయితే రిషబ్ పంత్, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్, మహ్మద్ షమీ వంటి ప్లేయర్లు గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే గాయంతో బాధపడుతూ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్, ఆర్చర్, క్రిస్ వోక్స్ వంటి తదితర క్రికెటర్లు గాయాలపాలయ్యారు. క్రిస్ వోక్స్ అయితే భుజానికి గాయమై కూడా ఒంటి చేతితో బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్ లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా కూడా గాయాల పాలయ్యాడు.
Also Read : Cristiano Ronaldo: రోనాల్డో ఎంగేజ్మెంట్ రింగ్ ధర ఎంతో తెలుసా.. ఆయనకు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పెరెరాకి బలమైన గాయం..?
ప్రస్తుతం ఆయనకు SLC T20 టోర్నమెంట్ లో జరిగిందట. దీంతో కుశాల్ పెరీరా చావు బతుకుల్లో ఉన్నట్టు సమాచారం. తలకు బంతి తగలడంతో బలమైన గాయమైనట్టు సమాచారం. మరోవైపు కుశాల్ పెరీరా ఈ మధ్య కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో క్రికెట్ కి ఇక గుడ్ బై చెప్పనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కుశాల్ చిన్నప్పుడు కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయితే.. 13 సంవత్సరాల తరువాత అతను కుడిచేతి నుంచి ఎడమచేతికి మారాడు. సనత్ జయసూర్య ని ఆదర్శంగా తీసుకొని అతను క్రికెట్ ఆడేవాడు. 2013 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. అయితే 2018 ఐపీఎల్ ప్రారంభానికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో నిషేదం ఎదుర్కొన్న SRH మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో SRH అతన్ని సంప్రదిస్తే.. అతను ఆఫర్ ని తిరస్కరించాడు. దీంతో వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్ ని పిలిచారు.
పెరెరా చికిత్స అక్కడే..
తాజాగా గాయపడిన శ్రీలంక వికెట్ కీపర్, బ్యాటర్ కుశాల్ పెరెరా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గతంలో కూడా పెరెరా యునైటేడ్ కింగ్ డమ్ లో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు సమాచారం. ఇది అతన్ని తిరిగి జట్టులోకి రావడానికి మరింత ఆలస్యం చేస్తోంది. 22 టెస్టులు, 107 వన్డేలు, అదేవిధంగా 60 టీ-20 మ్యాచ్ లు ఆడిన 32 ఏళ్ల అనుభవజ్ఞుడు, ఆసుపత్రి బెడ్ లో కోలుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. మరోవైపు తన సహచరుడు ఏంజెలో మాథ్యూస్ త్వరగా కోలుకోవాలని కుశాల్ పెరీరా ఫోటోను షేర్ చేశాడు. “మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఛాంపియన్ @kusalperera” అని ట్వీట్ చేశాడు మాథ్యూస్. శ్రీలంక క్రికెట్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకేలలో ముగ్గురు వైద్యులను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలిసింది. పెరెరా ఇంగ్లాండ్ లోని ఆండ్రూ వాలెస్ వద్ద చికిత్స తీసుకోవాలని కోరుకున్నాడు. అతను సచిన్ టెండూల్కర్ టెన్నీస్ ఎల్బోకు కూడా చికిత్స చేసిన క్రీడా గాయాల నిపుణుడు. అయితే SLC మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
Injury…It’s time for Kusal Janith Perara to retire from International Cricket I guess?? Thoughts? 🤔 pic.twitter.com/2wS1jlvpAu
— Nibraz Ramzan (@nibraz88cricket) August 11, 2025