BigTV English

Chiranjeevi Birthday Special : విశ్వంభర, మెగా అనిల్ అప్డేట్స్ ఇవే

Chiranjeevi Birthday Special : విశ్వంభర, మెగా అనిల్ అప్డేట్స్ ఇవే

Chiranjeevi Birthday Special : గత నాలుగు దశాబ్దానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలకు పదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా రీఎంట్రీ తర్వాత తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి కుదరటం లేదు. కానీ ఒక సినిమా రెండు సినిమాలు చేసిన దర్శకులకు మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు వస్తున్నాయి. ఒక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి, వశిష్ట దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బర్త్ డే అప్డేట్స్ ఇవే 


ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సినిమా అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ రెండు సినిమాలు ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సీజీలు వస్తే, ఈ సినిమా నుండి ఇంకో టీజర్ విడుదలవుతుంది. అప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా పోస్టర్ అనౌన్స్ చేస్తారు. విశ్వంభర నుండి సిజి కి సంబంధించిన కంటెంట్ రాకపోతే అనిల్ రావిపూడి నుండి ఒక చిన్న గ్లిమ్స్ వీడియో వస్తుంది. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి బర్త్డేకి ఈ రెండు సినిమాల నుంచి కూడా అప్డేట్స్ అయితే రానున్నాయి.

జాగ్రత్త పడిన విశ్వంభర

బింబిసారా సినిమా తర్వాత మల్లెడు వశిష్ట చేస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైనప్పుడు నాసిరకం విఎఫ్ఎక్స్ చూసి చాలా మంది విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ విఎఫ్ఎక్స్ కొంత మేరకు బాగానే ఉంటాయి. కానీ ఎలా ఉన్నా కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లు దానిని పట్టుకొని ఇంకా బాగా అతి చేసేసారు. అక్కడితో విశ్వంభర టీం జాగ్రత్త పడింది. సిజి విషయంలో కంప్లీట్ గా సాటిస్ఫై అయితే కానీ కంటెంట్ ను బయటకు వదలకూడదు అని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు వశిష్ఠ కూడా. అందుకే ఇప్పటివరకు కూడా సినిమా డేట్ ను అధికారికంగా ప్రకటించలేదు. నేను సాటిస్ఫై అయిన తర్వాతే అనౌన్స్ చేస్తాను అంటూ మాట్లాడారు. ఈ సినిమాకి సంబంధించి 80% వర్క్ అయిపోయింది మిగతా 20% అయిపోతే సినిమా అనౌన్స్ చేయడమే మిగిలింది.

Also Read: Coolie & War2 : గుడ్ న్యూస్… ఇక్కడ టికెట్ ధరల హైక్ లేదు

Related News

Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1కి ఆ శాపం.. అవరోధాలున్నాయని దేవుడు చెప్పాడు.. ప్రొడ్యూసర్‌ షాకింగ్‌ కామెంట్స్

66 Years Of Kamal Haasan: కమల్ హాసన్ వివాదాలకు కేంద్ర బిందువు

Tollywood: తుది దశకు చేరుకున్న సినీ కార్మికుల సమ్మె… రేపు ఫైనల్ మీటింగ్ ?

Vijay Sethupathi: డబ్బుతో అమ్మాయిలను వంచిస్తాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

Upasana: ఉప్సీ ఫోన్‌లో చరణ్ పేరు ఏం ఉంటుందో తెలుసా ? ఆ 200 వెనక పెద్ద కథే ఉంది

Anupama Parameswaran: 7:00 కి రమ్మంటారు… 9:30 కి షాట్ తీస్తారు, అడిగితే ఆటిట్యూడ్ అంటారు

Big Stories

×