Anupama Parameswaran: తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడటం ఎప్పటినుంచో మొదలుపెట్టారు. అలా చాలామంది చూసి విపరీతంగా కనెక్ట్ అయిన సినిమా ప్రేమమ్. ఇదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. దీనికంటే ముందే మలయాళం వెర్షన్ చాలామంది తెలుగు ప్రేక్షకులు చూశారు. అయితే ఆ సినిమాలో అనుపమ ను చూసి ఫిదా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా అ ఆ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగవల్లి అనే పాత్రలో నటించింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు మంచి సూపర్ హిట్ అయ్యాయి. శతమానం భవతి అనే సినిమాలో చేసిన నిత్య పాత్ర విపరీతంగా కనెక్ట్ అయింది.
అడిగితే ఆటిట్యూడ్ అంటారు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే శతమానం భవతి సినిమా హిట్ అయిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ వరుసగా అవకాశాలు వచ్చాయి.
అయితే అనుపమ సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం పరదా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి పలు రకాల కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలన్న కష్టమైన పరిస్థితి. వాళ్లకు నచ్చినది చెప్తే వెంటనే ఆటిట్యూడ్ అంటారు.
7:00 కి రమ్మంటారు… 9:30 కి షాట్ తీస్తారు. 2½ Hours ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఈ గ్యాప్ లో చాలా షాట్స్ తీయొచ్చు కదా? అంటే… ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు.
నేనెందుకు వెయిట్ చేయాలి.?
షాట్ ఉంటే పిలవచ్చు. ఆ సినిమా షూటింగ్ కి వచ్చే కోఆర్డిస్ట్ రోజు లేటుగా వస్తారు. అని నేను మాత్రం రెండు గంటల ముందొచ్చి ఖాళీగా కూర్చోవాలి. షాట్ లేకుండా ఎందుకు పిలవటం.? నేను దీనివలన చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇప్పుడు నేను దానిని పెద్దగా పట్టించుకోను. ఆ 2 అవర్స్ లో చాలా చేయొచ్చు. అవన్నీ నాకోసం అడగట్లేదు సినిమా కోసం అడుగుతున్నాను. ఇవన్నీ అడిగితే నా డబ్బులు కదా నీకెందుకు అంటారు. అంటూ అనుపమ కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీన్నిబట్టి ఆ లేటుగా వచ్చే హీరో ఎవరు.? ఆ ప్రొడక్షన్ హౌస్ ఏంటి అని కొంతమంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు.