E-Paper
Advertisement

First Hydrogen-Powered Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?

First Hydrogen-Powered Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?
Advertisement

Next-Gen Indian Railways: భారతీయ రైల్వేలోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో, మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇండియన్ రైల్వే లో గ్రీన్ రెవల్యూషన్ మొదలు కాబోతోంది. దేశంలో హైడ్రోజన్ తో నడిచే రైలు అందుబాటులోకి రాబోతోంది. జింద్- సోనిపట్ మార్గంలో ఈ రైలు తొలిసారి తన సర్వీసులను అందించబోతోంది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందించబోతోంది. నెక్ట్స్ జనరేషన్ రైల్వేకు పునాది వేయబోతోంది. హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఫైనల్ లోడింగ్ టెస్ట్ ఈ వారం జింద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతుంది.

జనవరి 26న ట్రయల్ రన్ ప్రారంభం

జనవరి 26 గణతంత్ర దినోవత్సవం సందర్భంగా జింద్- సోనిపట్ మధ్య 90 కి.మీ మార్గంలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ట్రయల్ రన్ కోసం రైలు కాన్ఫిగరేషన్‌లో రెండు డ్రైవర్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ట్రయల్ పూర్తయిన తర్వాత, ఇండియన్ రైల్వే, RDSO, స్పానిష్ భాగస్వామి అయిన గ్రీన్ H కంపెనీ కలిసి సంయుక్తంగా ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతున్నాయి. టెస్ట్ పూర్తి అయిన తర్వాత ఈ నివేదిక రెడీ కానుంది. హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లు సాంప్రదాయ డీజిల్ తో నడిచే ఇంజిన్ల కంటే మరింత పవర్ తో రెడీ అయ్యాయి. హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లు మరింత వేగంగా, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి.

గంటకు 150 కిలో మీటర్ల గరిష్ట వేగంతో..            

Advertisement

హైడ్రోజన్ రైళ్లు గంటకు 150 కి.మీ గరిష్ట వేగంతో నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైడ్రోజన్ పవర్ కు సంబంధించి  ఆసక్తికర విషయం చెప్పారు. ఇటీవలి పరీక్షలో ఎలక్ట్రోకెమికల్ టెక్నాలజీని ఉపయోగించి, 9 లీటర్ల వాటర్ 900 గ్రాముల హైడ్రోజన్‌ ను  తయారు చేసినట్లు తెలిపారు. ఇది రైలును ఒక కిలోమీటరు నడపడానికి సరిపోతుంది. రైల్లో   3000 కిలోల హైడ్రోజన్ తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. 7,680 కిలోల ఆక్సిజన్‌ను కలిగి ఉంటుంది.

స్పానిష్ సంస్థతో కలిసి హైడ్రోజన్ తయారీ

దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని జింద్ లో ఏర్పాటు చేశారు. స్పానిష్ సంస్థతో కలిసి భారత ప్రభుత్వం హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభించింది. 1.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాతో, ప్లాంట్ పూర్తిగా పని చేస్తోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ రైలు కోచ్‌లు షకూర్ బస్తీ స్టేషన్‌కు చేరుకున్నాయి. వాటిలో పదహారు ప్యాసింజర్ కోచ్‌లు, నాలుగు డ్రైవర్ పవర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలు బోగీలను తయారు చేసింది.  హైడ్రోజన్ రైలు ఆధునిక మెట్రో వ్యవస్థ మాదిరిగా సేవలు అందించనుంది. ఈ రైల్లో ముందు, వెనుక డ్యూయల్ పవర్ డ్రైవర్ పవర్ కార్లు ఉంటాయి. ఒక్కోటి 1200 HP మోటార్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని ఆన్‌బోర్డ్ సౌకర్యాలకు హైడ్రోజన్ పవర్ నుంచే పని చేస్తాయి. రైలుకు రెండు వైపులా ఆటోమేటిక్ డోర్లు, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ డిస్ ప్లే సిస్టమ్‌లు ఉంటాయి. స్మార్ట్ డిజైన్‌ తో ఈ రైళ్లు రూపొందాయి.

Advertisement

Read Also: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×