E-Paper
Advertisement

Vande Bharat Sleeper Trains: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!

Vande Bharat Sleeper Trains: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!
Advertisement

First Vande Bharat Sleeper Train: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు వందేభారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా పరుగులు తీస్తుండగా, ఇప్పుడు రాత్రిపూట ప్రయాణాలకు అనుగుణంగా స్లీపర్ రైళ్లు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.కేరళతో సహా అన్ని రాష్ట్రాలలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ నెలలో ప్రారంభించనున్న హౌరా-గౌహతి-హౌరా వందే భారత్ స్లీపర్ రేక్‌ను పరిశీలించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. “కేరళతో సహా అన్ని రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం, ఈ రైళ్లకు సంబంధించిన ఉత్పత్తిని పెంచాం” అని తెలిపారు.

తొలి వందేభారత్ స్లీపర్ రైలు గురించి.. 

వందేభారత్ స్లీపర్ రైళ్లు 1000 కిలో మీటర్ల నుంచి 1500 కిలో మీటర్ల రాత్రి పూట ప్రయాణానికి అనుగుణంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.ప్రయాణీకులు సాయంత్రం పూట రైలు ఎక్కి మరుసటి రోజు ఉదయం తమ గమ్యస్థానానికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సౌకర్యం, భద్రతతో సహా ప్రయాణీకుల సౌకర్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిజైన్ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ రైలులో CCTV కెమెరాలు, కవచ్ భద్రతా వ్యవస్థ, ఇతర లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హౌరా – గౌహతి- హౌరా వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మార్గంలో రెండు రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఒక రైలు హౌరా నుంచి గౌహతికి, మరో రైలు గౌహతి నుంచి హౌరాకు బయల్దేరుతాయి. సాయంత్రం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మరో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వేలోకి ఎంట్రీ ఇస్తాయి. ఈ ఏడాది మొత్తం వందేభారత్ స్లీపర్ రైళ్ల సంఖ్య 12కు చేరుకుంటుంది. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి పెంచాం” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. , ఉత్పత్తిని వేగంగా పెంచనున్నారు” అని మంత్రి చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు

ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రన్ అవ్వడం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సికింద్రాబాద్ – న్యూ ఢిల్లీ రూట్‌ లో స్లీపర్ వెర్షన్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పాపులర్ లాంగ్ డిస్టెన్స్ రూట్. రాజధాని, దురంతోలకు పోటీగా ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఇతర రూట్స్ విషయానికి వస్తే విశాఖ-ఢిల్లీ రూట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ, అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

ఇక ప్రస్తుతం వందే భారత్ చైర్ కార్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంతపూర్ (బెంగళూరు), విజయవాడ, విశాఖ స్టాప్స్ ఉన్న రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్ల గురించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: సంక్రాంతి వేళ రైల్వే గుడ్ న్యూస్, ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆ స్టేషన్ లోనూ ఆగుతాయట!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×