E-Paper
Advertisement

Rayudu Murder Case: వినుత కోట డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు

Rayudu Murder Case: వినుత కోట డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
Advertisement

Rayudu Murder Case: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై వినుత కోట భర్త చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే ప్రధాన సూత్రధారి అన్నారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు. తన భార్యను రాజకీయంగా ఎదుర్కొలేక రాయుడి హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు.

త్వరలో పూర్తి ఆధారాలు బయటపెడతా

పక్కా ప్లాన్ ప్రకారమే డ్రైవర్ రాయుడు హత్య జరిగిందంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడి హత్య విషయం చెన్నై పోలీసుల కన్నా ముందే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. రాయుడు హత్య జరిగిన సమయంలో తాము చెన్నై ఆస్పత్రిలో ఉన్నామన్నారు. రాయుడి సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని, తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బట్టబయలు అవుతాయని వినుత కోట భర్త చంద్రబాబు హెచ్చరించారు. దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక్కసారి పొలిటికల్ హీట్ పెరిగింది.

సీఐ చెన్నై ఎందుకు వెళ్లారు?

Advertisement

ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేసి తమిళనాడులో జనం ఎక్కువగా ఉండే ప్రాంతంలో మృతదేహాన్ని పడేయడం సామాన్యులకు సాధ్యం కాదని, దీని వెనుక పెద్దల హస్తం ఉందని వినుత కోట భర్త చంద్రబాబు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలున్నాయన్నారు. చెన్నైలో దర్యాప్తు జరుగుతుండగానే.. శ్రీకాళహస్తి పట్టణ సీఐను చెన్నైకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. డ్రైవర్ రాయుడు తనకు తమ్ముడి లాంటి వాడని ఎమ్మెల్యే అనడం, అంత్యక్రియలు తామే జరిపిస్తామని చెప్పడం.. ఆ వెంటనే మాపై కేసులు పెట్టడం చూస్తుంటే.. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు తెలుస్తోందన్నారు.

Also Read: చేయని తప్పునకు జైలుకెళ్లాం.. నాపై కుట్రను ఆధారాలతో బయటపెడతా: వినుత కోటా

సుధీర్ రెడ్డి లక్ష్యంగా

Advertisement

డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినుత కోట దంపతులకు ఇటీవల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఈ హత్య కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేయడంతో కేసు మరో టర్న్‌ తీసుకుంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×