Cable Bridge: దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి.. ప్రయాణికులకు త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. కర్ణాటక శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని.. శరావతి బ్యాక్ వాటర్ పైన రూ. 473 కోట్లతో నిర్మించనున్నారు. ఈ విశిష్ట వంతెనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి.. జూలై 14న అధికారికంగా ప్రారంభించారు.
ఇంజినీరింగ్ అద్భుతం
ఈ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి మొత్తం 2.14 కిలోమీటర్ల పొడవుతో, 16 మీటర్ల వెడల్పుతో నిర్మించబడింది. వంతెన ప్రధానంగా 740 మీటర్ల మేర కేబుల్ ఆధారంగా నిలుస్తుండడం.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని నిర్మాణ శైలి ఆధునికమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమీప ప్రాంతాలకు వేగవంతమైన కనెక్షన్ అందించడంతోపాటు, ఇది పర్యాటక ఆకర్షణగా కూడా మారనుంది.
ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఈ బ్రిడ్జి ప్రారంభం వల్ల స్థానిక ప్రజలకు గమ్యస్థానాలకు చేరుకోవడం సులభమవుతుంది. ఇప్పటి వరకు పడవల మీదే ఆధారపడుతూ ప్రయాణాలు సాగించాల్సి వచ్చేది. ముఖ్యంగా విపత్కర వాతావరణం ఉన్న సమయంలో ప్రయాణాలు ఎంతో ప్రమాదకరంగా ఉండేవి. ఇకపై బ్రిడ్జి ద్వారా సురక్షితంగా, వేగంగా ప్రయాణించవచ్చు. ఈ వంతెన ప్రయాణికులకు సమయం, వ్యయాన్ని ఆదా చేస్తుంది.
గుజరాత్‌లోని సుదర్శన్ సేతు తర్వాత రెండోది
ఇంతకుముందు దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా.. గుజరాత్‌లోని ఒఖా – బేట్ ద్వారకా మధ్య ఉన్న సుదర్శన్ సేతు నిలిచింది. దాని పొడవు 2.32 కిలోమీటర్లు. అది దేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ బ్రిడ్జిగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు శరావతి బ్యాక్ వాటర్‌పై నిర్మించిన ఈ వంతెన.. రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టిస్తోంది.
పర్యాటకాభివృద్ధికి కొత్త చైతన్యం
శివమొగ్గ జిల్లా అనేక ప్రకృతి సంపదలతో, నీటి వనరులతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ వంతెన నిర్మాణం పూర్తవడంతో ఇక్కడికి పర్యాటకుల రాక పెరగనుంది. ప్రత్యేకించి ఫోటోగ్రఫీ, డ్రోన్ వ్యూస్ కోసం వచ్చే వారు.. దీనిని ప్రధాన ఆకర్షణగా మలచుకునే అవకాశం ఉంది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరం ఇదేనట, ఎక్కడో కాదు మనదేశంలోనే ఉంది
భవిష్యత్ ప్రణాళికలు
ఈ వంతెన కేవలం రవాణాకు మాత్రమే కాకుండా, వ్యాపారానికి కూడా మార్గం కల్పించనుంది. సమీప గ్రామాలకు మార్కెట్ లింక్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఇలాంటి మరిన్ని హైటెక్ వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా పరివాహక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరిచే దిశగా ఈ వంతెనలు కీలక పాత్ర పోషించనున్నాయి.
Inaugurated India’s second-longest cable-stayed bridge—the 6-km-long Sharavathi Bridge in Karnataka—built at a cost of ₹472 crore to enhance regional connectivity and boost mobility across the Malnad region.#PragatiKaHighway #GatiShakti pic.twitter.com/ES4VQoGeRx
— Nitin Gadkari (@nitin_gadkari) July 14, 2025