లండన్ లో దారుణం జరిగింది. లోక్ ట్రైన్ లో ఓ దుండగుడు కత్తితో విరుచుకుపడ్డాడు. ప్రయాణీకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
శనివారం (నవంబర్ 1) అర్ధరాత్రి కేంబ్రిడ్జి షైర్ లోని హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన రైల్లో ఈ ఘటన జరిగింది. రైలు డాన్ కాస్టర్ నుంచి లండన్ కింగ్స్ క్రాస్ స్టేషన్ కు వెళ్తుండగా ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ప్రయాణికులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో రైల్లో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. కత్తిపోట్లు తగిలిన ప్రయాణీకులు రక్తం మండుగులో పడిపోయాడు. దుండగుడి దాడి నుంచి తప్పించుకునేందకు ఎక్కడిక్కడ దాక్కున్నారు. కొంత మంది టాయిలెట్స్ లోకి వెళ్లి డోర్స్ లాక్ చేసుకున్నారు. రైలును హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. కత్తిపోట్లతో రైలు బోగీ అంతా రక్తసిక్తం అయ్యింది. పొడవైన కత్తితో దుండగుడు బీభత్సం సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
అటు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హంటింగ్ డన్ స్టేషన్ చేరుకున్నారు. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గాయాల పాలైన ప్రయాణికులను వెంటనే అంబులెన్స్ లలో సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీసులు ఈ ఘటనను అత్యంత పాశవికమైన దాడిగా అభివర్ణించారు. ఈ దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉందా? దేశంలో ఎవరైనా అల్లర్లను సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: న్యూయార్క్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం.. ఆగివున్న విమానాన్ని ఢీకొన్న మరో విమానం
అటు ఈ ఘటనపై బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ ఘటన అత్యంత భయంకరమైనదిగా అభివర్ణించారు. బాధితులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందించిన ఎమర్జెన్సీ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు, ప్రయాణీకులు స్థానిక అధికారుల సలహాను పాటించాలని స్టార్మర్ సూచించారు.
Read Also: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్