అత్యంత చవకైన నగరం అంటే ఒక మధ్యతరగతి మనిషి అన్ని సౌకర్యాలతో సంతోషంగా జీవించేందుకు అనుకూలమైన ప్రాంతమని చెప్పుకోవాలి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణం ప్రజల జీవిత విలువలను దిగజారుస్తోంది. గ్రామంలో, నగరంలో ప్రతి చోటా ద్రవ్యోల్భణం పెరగడం వల్ల ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న వారు అధికంగానే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా మన భారతదేశంలోని ఒక నగరం నిలవడం ఆశ్చర్యకరమే. అది కేరళలోని కోయంబత్తూర్.
అత్యంత చవక నగరం ఇదే
అందానికి, ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది కోయంబత్తూర్. ఈ నగరంలో జీవించడం చాలా చవక అని ఒక అంతర్జాతీయ సర్వే వివరిస్తోంది. బెల్ గ్రేడ్ చెందిన డేటా కంపెనీ నుబియో 2025 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అలాగే అత్యంత చవకైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అన్ని పెద్ద పెద్ద నగరాలనే తీసుకుంది. చిన్న పట్టణాలను, గ్రామాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ జాబితాలో భారత దేశంలోని కోయంబత్తూర్ ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది.
ఈ సర్వేలో ఆహారం ఇంటి అద్దెలు, జీతభత్యాల ఖర్చులు, రవాణా, చదువు, ఆరోగ్య ఖర్చులు వంటివన్నీ పరిగణలోకి తీసుకున్నారు. దాన్ని బట్టి చూస్తే ప్రపంచంలోని నగరాలలో కోయంబత్తూర్ లోనే అతి తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఆ కంపెనీ ఆ సర్వే వివరిస్తుంది.
కోయంబత్తూర్ తర్వాత ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ప్రపంచంలోనే రెండవ చవకైన నగరంగా నిలిచింది. ఇక మూడు నాలుగు స్థానాల్లో పాకిస్థాన్లోని లాహోర్, కరాచీ నగరాలు నిలిచాయి. ఆ తరువాత ఐదవ స్థానంలో లక్నో, ఆరవ స్థానంలో జైపూర్, ఏడవ స్థానంలో సూరత్ నిలిచాయి.
అత్యంత ఖరీదైన నగరాలు ఇవే
ఇక ఖరీదైన నగరం విషయానికి వస్తే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరం అత్యంత ఖరీదైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. సిట్జర్లాండ్ లోని లావ్సన్ రెండవ స్థానంలో, జెనీవా మూడవ స్థానంలో నిలిచాయి. అంటే స్విట్జర్లాండ్ లోని మూడు నగరాలు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. ఇక అమెరికాలోని న్యూయార్క్ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన నగరంగా నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక ఐదు, ఆరు స్థానాల్లో మళ్ళీ స్విట్జర్లాండ్ నగరాలే చోటు సంపాదించాయి.
ఈ ఖరీదైన నగరాలను చూడడానికి వెళ్లినా, నివసించడానికి వెళ్లినా జేబు నిండా నోట్ల కట్టలు వేసుకొని వెళ్లాల్సిందే. ఈ నగరాల్లో బస చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఆహారానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఇక మన ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచిన కోయంబత్తూర్ లో ఎన్నో ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. కోయంబత్తూర్ వెళ్తే కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల గురించి ఇక్కడ ఇచ్చాము. వాటిలో ముఖ్యమైనది మరుధమలై మురుగన్ ఆలయం, ఈచనారి వినాయగర్ ఆలయం, ధ్యాన లింగ ఆలయం. అలాగే గ్యాస్ ఫారెస్ట్ మ్యూజియం, సిరువాని జలపాతాలు, పులియాకులంలోని భారీ గణేషుడి స్మారక చిహ్నం వంటివన్నీ కోయంబత్తూర్ లో చూసేందుకు అందంగా ఉంటాయి.