ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న ఇందూరు ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరింది. తొలిసారి నిజామాబాద్ నుంచి న్యూఢిల్లీకి డైరెక్ట్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలు నిజమాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్తుంది. ఈ రైలుతో నిజామాబాద్ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. అదే సమయంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత మూడో పట్టణానికి జాతీయ రాజధానితో ప్రత్యక్ష రైలు లింకును అందిస్తోంది.
ఇప్పటివరకు, నిజామాబాద్‌ను దేశ రాజధానికి అనుసంధానించే డైరెక్ట్ రైలు లేదు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, రాజన్న, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాల నివాసితులు న్యూఢిల్లీకి రైళ్లు ఎక్కడానికి సికింద్రాబాద్ లేదంటే మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లాల్సి వచ్చేది. ముంబై, చెన్నై మరియు జైపూర్‌లకు రైళ్లు నిజామాబాద్ గుండా వెళ్ళినప్పటికీ, ఇప్పటి వరకు ఢిల్లీకి డైరెక్ట్ రైలు లేదు. ఇకపై ఆ ఇబ్బంది తప్పనుంది. నేరుగా నిజామాబాద్ నుంచి న్యూఢిల్లీకి రైల్లో వెళ్లే అవకాశం కలగనుంది.
కొత్త సికింద్రాబాద్- న్యూఢిల్లీ రైలు (నం. 07081/07082) నిజామాబాద్ మీదుగా నడుస్తుంది. సెప్టెంబర్ 2న ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. దీని వలన మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్కెడ్ వాసులకు దేశ రాజధానికి వారి మొదటి ప్రత్యక్ష రైలు లింక్ లభిస్తుంది. ఈ రైలులో 1వ AC, 2వ AC, 3వ AC, స్లీపర్ మరియు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
Read Also: కోచ్ లు పెంచకపోగా ఉన్న టైమ్ తగ్గిస్తారా? హైదరాబాద్ మెట్రోపై ప్రయాణీకుల ఆగ్రహం!
నిజామాబాద్ నుంచి ఢిల్లీకి నేరుగా రైలు సౌకర్యం కల్పించడం పట్ల ఇందూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఏళ్ల కలను నెరవేర్చిన రైల్వేశాఖకు ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలంగా ఎదురుచూసిన తర్వాత, న్యూఢిల్లీకి నేరుగా రైలు ఉండాలనే తమ కల నెరవేరిందన్నారు. ఈ ప్రత్యేక రైలు త్వరలో సాధారణ సర్వీసుగా మారనుంది.
Read Also: రైల్వే స్టేషన్ లో యువకుడి పైత్యం, అందరూ చూస్తుండగా మూత్ర విసర్జన, వీడియో వైరల్!