Snow Places In May: మండే ఎండ, వేడి నుండి ఉపశమనం పొందడానికి.. ఎవ్వరైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని కోరుకుంటారు కానీ ఈ సీజన్‌లో దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే హిల్ స్టేషన్లలో మాత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మే నెలలోనూ మంచు అందాలు , చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే వారు భారతదేశంలోని కొన్నిప్రదేశాలకు వెళ్లొచ్చు.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. మీరు భారతదేశంలోని కొన్ని హిల్ స్టేషన్లలో మంచును ఆస్వాదించవచ్చు. అది కూడా రూ. 10,000 బడ్జెట్‌తో. వేసవిలో చల్లదనం, మంచు రెండింటినీ ఆస్వాదించగల కొన్ని బడ్జెట్ అనుకూలమైన మంచు కొండ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనాలి :
హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన కొండ ప్రాంతం అయిన మనాలిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనాలిలోకి అడుగుపెట్టగానే మంచు పర్వతాలు కనిపిస్తాయి. తెల్లటి మంచులో సమయాన్ని గడపాలంటే. సోలాంగ్ వ్యాలీ, రోహ్తాంగ్ పాస్‌లకు వెళ్లండి. మే నెలలో మీరు ఇక్కడ మంచును చూడవచ్చు. అంతే కాకుండా అడ్వెంచర్‌లను కూడా ఆస్వాదించవచ్చు. మీరు రూ. 10,000 లలో బడ్జెట్ ట్రిప్ వెళ్లాలనుకుంటే.. చండీగఢ్ నుండి మనాలికి వోల్వో బస్సులో వెళ్లవచ్చు. ఢిల్లీ నుండి మనాలికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా.. మనాలిలో హోమ్‌స్టే లేదా హోటల్ గదులను బుక్ చేసుకోవడం ద్వారా బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ఎంజాయ్ చేయొచ్చు. అంతే కాకుండా స్థానికంగా ఉన్న ప్రదేశాలను ఎంజాయ్ చేయడానికి మీరు బైక్‌లను కూడా రెంట్ తీసుకోవచ్చు.
ఔలి:
హిల్ స్టేషన్ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ఇక్కడ పర్యాటకుల రద్దీ కూడా అంతగా ఉండదు. గర్హ్వాల్ హిమాలయాల లోయలలో ఉన్న ఔలిలో మే నెలలో కూడా మంచు కురిసే అవకాశం ఉంటుంది. మీరు హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి స్థానికంగా దొరికే బస్సు లేదా షేర్డ్ టాక్సీ ద్వారా ఔలి చేరుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో కూడా బస చేయడం ద్వారా బడ్జెట్‌లో మీ ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్రాంతం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడికి నిత్యం వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కూడా వస్తుంటారు.
తవాంగ్:
తక్కువ ఖర్చుతోనే ట్రిప్ కోసం అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు వెళ్లొచ్చు. తవాంగ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో ఎల్లప్పుడూ మంచు కురుస్తుంది. మే నెలలో కూడా మంచు పొరలు ఇక్కడ కనిపిస్తాయి. తవాంగ్ కు వెళ్లడానికి .. మీరు గౌహతి వెళ్లి అక్కడి నుండి షేర్డ్ టాక్సీ తీసుకోవచ్చు. అంతే కాకుండా మీరు బడ్జెట్ ట్రిప్ కు వెళ్లాలనుకుంటే.. ముందుగానే అక్కడి హోటళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు.
Also Read: ఏపీలో అందమైన బీచ్‌లు ఇవే.. అస్సలు మిస్సవ్వొద్దు !
సోనామార్గ్ :
అద్భుతమైన సహజ దృశ్యాలు, అందమైన మంచు లోయలు , అద్భుతమైన నీలి సరస్సుల కారణంగా సోనామార్గ్ జమ్మూ, కాశ్మీర్ పర్యాటకులకు ఒక ఆకర్షణ కేంద్రంగా ఉంది. సోనామార్గ్‌లో, వేసవిలో కూడా మంచు కనిపిస్తుంది. మే నెలలో కూడా థాజివాస్ హిమానీనదంలో మంచు కనిపిస్తుంది. సోనామార్గ్ కు ప్రయాణించడానికి మీరు జమ్మూ నుండి బస్సు లేదా షేరింగ్ టాక్సీ తీసుకోవచ్చు. స్థానిక గెస్ట్‌హౌస్‌లు చౌకగా లభిస్తాయి. ఇక్కడ మంచు అందాలను ఆస్వాధించవచ్చు.