Sandhya Theatre Stampede: హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావటం, అదే టైం లో జనం ఎక్కువగా గుమికూడటంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగవడం, ఆయనను అల్లు అరవింద్ పరామర్శించడం మనం చూసాం.. ఇక ఈ ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC కు ఫిర్యాదు చేశారు. పోలీసుల లాఠీ చార్జి, తగిన భద్రత ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ ఘటన కారణమని ఆరోపించారు.. అందులో భాగంగా తాజాగా సంధ్యా థియేటర్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీపీ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు చూద్దాం..
రంగంలోకి హ్యూమన్ రైట్స్ కమిషన్..
సంధ్యా థియేటర్లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు, సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జనవరిలో పోలీసులు ఆదేశించినది హ్యూమన్ రైట్స్ కమిషన్. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి జితేందర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్‌కు 2025 జనవరి 1న నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఆరు వారాలలో ఈ ఘటనపై వివరాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నోటీసులు ఫిర్యాదులో పేర్కొన్న పోలీసుల లాఠీచార్జి, థియేటర్ వద్ద తొక్కిసలాటకు, సంబంధించిన అన్ని వివరాలు అందజేయాలని తెలిపింది. ఈ ఘటనపై సీనియర్ ర్యాంకు పోలీస్ అధికారితో విచారణకు మీఆదేశించారు. అసలు పోలీసులు లాఠీచార్జికి ఎందుకు దిగారు. అలాంటి పరిస్థితుల్లో తగిన భద్రత ఏర్పాటు ఎందుకు చేయలేదని, ఎన్ హెచ్ ఆర్ సి పోలీసులను ప్రశ్నించింది.
హ్యూమన్ రైట్స్ ..ఆదేశాలు
పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు పెట్టి ఇంత గొడవ జరుగుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని కమిషన్ నిలదీసింది. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసులాట జరిగిందని లాఠీ చార్జి చేయలేదని, నివేదికలో పేర్కొన్న పోలీసులు అసలు ఆయన స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు.. అల్లు అర్జున్ థియేటర్ దాకా ఎలా వచ్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.. పుష్ప 2 షోలో జరిగిన తొక్కిసలాటపై సమగ్ర నివేదిక లేకపోవడంపై పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌హెచ్ఆర్సీ.సీపీ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసి, ఆరు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
తొక్కిసలాట కేసులో పోలీసులకు, బన్నీకి షాక్…
ఈ ఘటనపై ఏ11 గా అల్లు అర్జున్ ముద్దాయిగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ జైల్లో ఒక రోజు గడపడం ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం జరిగింది. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అయింది కేసు పై మళ్ళీ విచారం జరిగే ఛాన్స్ ఉండొచ్చని సమాచారం. అదే జరిగితే అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. మరోసారి ఆయన ను ఈ కేసు పై విచారణ చేసే ఛాన్స్ ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అవడంతో ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందన్నది ఇప్పటికైనా బయటికి వస్తుందో లేదో చూడాలి.