Ghatikachalam: రీసెంట్ టైమ్స్ లో కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయి. ప్రేక్షకులు ఆలోచించే విధానం కూడా కొంత మేరకు కంప్లీట్ గా మారిపోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాను ఆదరించడం ఎప్పటినుండో మొదలుపెట్టారు. అలా రీసెంట్ టైమ్స్ లో చిన్న కాన్సెప్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో హర్రర్ సినిమాలు రావడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతవరకు తగ్గిపోయింది. ఇప్పుడు హర్రర్ కాన్సెప్ట్ తో ఒక చిన్న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఆ సినిమా పేరు ఘటికాచలం.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్
కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన నిఖిల్ దేవాదుల కీలక పాత్రలో కనిపిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. ఎం.సి.రాజు నిర్మించారు. ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి వంటి తారలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను మారుతి ఎస్కేఎన్ కలిసి రిలీజ్ చేయనున్నారు.
ఇంట్రెస్టింగ్ ట్రైలర్
ఒక సినిమాను ప్రేక్షకుడి వరకు తీసుకెళ్లాలి అంటే ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంది. ఒక తెలివైన అబ్బాయి దెయ్యాలకు భయపడటం ఈ ట్రైలర్ లో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు డిజైన్ చేసిన విధానం ప్రేక్షకుడికి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.