BigTV English

Beaches In AP: ఏపీలో అందమైన బీచ్‌లు ఇవే.. అస్సలు మిస్సవ్వొద్దు !

Beaches In AP: ఏపీలో అందమైన బీచ్‌లు ఇవే..  అస్సలు మిస్సవ్వొద్దు !

Beaches In Ap: ఆంధ్రప్రదేశ్.. భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక రాష్ట్రం.ఏపీ 970 కిలోమీటర్ల సుందరమైన తీరప్రాంతంతో ప్రసిద్ధి చెందింది. ఈ తీరప్రాంతం బంగాళాఖాతం వెంబడి విస్తరించి, అనేక అద్భుతమైన బీచ్‌లను కలిగి ఉంటుంది. ఇక్కడి బీచ్‌లు సహజ సౌందర్యం, ప్రశాంతతో పాటు వివిధ రకాల అడ్వెంచర్స్ కు చాలా ఫేమస్. ఇంతకీ ఏపీలో ఫేమస్ బీచ్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి ప్రత్యేకతలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రుషికొండ బీచ్ (విశాఖపట్నం):

రుషికొండ బీచ్, విశాఖపట్నంలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి. దీనిని “తూర్పు తీరంలోని రత్నం” అని పిలుస్తారు. ఈ బీచ్‌ బంగారు రంగు ఇసుక, నీలి రంగులోని నీరు, సమీపంలో ఆకుపచ్చని కొండలతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, స్పీడ్ బోటింగ్ వంటివి కూడా ఉంటాయి. అంతే కాకుండా హోలీ సమయంలో ఈ బీచ్ రంగుల ఉత్సవంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఈ బీచ్‌ను బాగా నిర్వహిస్తుంది. ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రుషికొండ బీచ్ విశాఖపట్నం నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఈ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. ఇది దాని యొక్క శుభ్రత, భద్రతను సూచిస్తోంది.


రామకృష్ణ బీచ్ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మరో ప్రముఖ బీచ్ రామకృష్ణ బీచ్ (RK బీచ్). ఇది రామకృష్ణ మిషన్ ఆశ్రమం, కాళీ ఆలయం పేరు మీద పిలువబడుతుంది. ఈ బీచ్ అందమైన తీరప్రాంతం కలిగి ఉంటుంది. సముద్ర ఆహార రుచులతో ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ బీచ్‌లో ఈత కొట్టడం సురక్షితం కానప్పటికీ.. సాయంత్రం నడవడం, సూర్యాస్తమయం చూడటానికి ఇక్కడి నిత్యం చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న డాల్ఫిన్ నోస్ రాక్ దాని ప్రత్యేక ఆకృతి కారణంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

యారడ బీచ్ (విశాఖపట్నం): యారడ బీచ్ విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మూడు వైపులా కొండలతో, ఒక వైపు బంగాళాఖాతంతో ఉన్న ఈ బీచ్ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇది ఎక్కువగా రద్దీ లేని బీచ్‌.. కాబట్టి నిశ్శబ్దంగా గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి.

సూర్యలంక బీచ్ (గుంటూరు): గుంటూరు జిల్లాలోని బాపట్లకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక బీచ్, విశాలమైన సముద్ర తీరం, నీలి రంగు నీటికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ కుటుంబ విహారయాత్రలకు అనువైనది. ఇక్కడ పిక్నిక్‌లు వాకింగ్ చాలా ఆనందదాయకంగా ఉంటాయి. నవంబర్‌లో ఇక్కడ డాల్ఫిన్‌లను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మైపాడు బీచ్ (నెల్లూరు): నెల్లూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైపాడు బీచ్ బంగారు రంగు ఇసుక, కొబ్బరి చెట్లు, స్పీడ్ బోటింగ్ సౌకర్యాలతో ఆకర్షిస్తుంది. ఈ బీచ్ ప్రశాంత వాతావరణం కోసం వివిధ ప్రదేశాల నుండి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

భీమునిపట్నం బీచ్ (విశాఖపట్నం): భీమిలి బీచ్‌గా పిలువబడే ఈ బీచ్, విశాఖపట్నం నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నల్లటి ఇసుక , డచ్ కాలం నాటి శిథిలాలు దీనిని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గోస్తని నది.. సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉన్న ఈ బీచ్ చారిత్రక ఆకర్షణ కలిగి ఉంది.

మంగినపూడి బీచ్ (మచిలీపట్నం): మచిలీపట్నం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగినపూడి బీచ్, నల్లటి మట్టి, శాంతమైన నీటితో ప్రసిద్ధి చెందింది. ఇది కుటుంబ సమేతంగా చూడి , ఎంజాయ్ చేయడానికి బెస్ట్ బీచ్. మాఘ పూర్ణిమ ఉత్సవ సమయంలో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది.

బరువ బీచ్ (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలోని బరువ బీచ్, మహేంద్ర తనయ.. నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉంది. లైట్‌హౌస్ , పురాతన ఆలయాలు ఇక్కడి ఆకర్షణలు. ఇది రద్దీ లేని బీచ్‌ కాబట్టి, ప్రశాంతత కోరుకునే వారికి అనువైనది.

Also Read: వైజాగ్ టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

ఉప్పాడ బీచ్ (కాకినాడ): కాకినాడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ బీచ్, దాని ప్రశాంత వాతావరణం, సమీపంలోని పార్కులతో కుటుంబంతో గడపడానికి చాలా అనువైనది. ఇక్కడ సముద్ర ఆహారం, స్థానిక వంటకాలు ఆస్వాదించవచ్చు.

వొడరేవు బీచ్ (చీరాల): చీరాల నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వొడరేవు బీచ్, కొబ్బరి చెట్లు, బంగారురంగు ఇసుకతో అందంగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×