Railway Offer: ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది. వేలు కాదు వందలు కాదు లక్షలు మీ సొంతం చేసుకొనే ఛాన్స్ ఇండియన్ రైల్వే మీ ముందుకు తెచ్చింది. అందుకు మీరు చేయవలసినది ఏమిటి? ఎలా ఆ డబ్బులు పొందాలో తెలుసుకోవాలంటే, ఈ కథనం చివరి వరకు చదివితే సరి.
ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందించడంలో ముందున్న సంస్థగా పేరొందింది. ఇక ఇప్పుడు, రైల్వే స్టేషన్లలో ప్రతి ప్రయాణికుడి చూపు పడే గడియారాల రూపాన్ని మార్చేందుకు ఒక కొత్త అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ పోటీ పేరు డిజిటల్ గడియారాలకు కొత్త ఆకారం.. డిజైన్ పోటీ 2025. మీరు కళ, సాంకేతికత, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారైతే ఇది మీకు సరైన వేదిక. జస్ట్ ఇలా చేసి లక్షలు దక్కించుకొనే ఛాన్స్ ఇదే.
ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీరు డిజైన్ చేసిన డిజిటల్ గడియారాలు రైల్వే స్టేషన్లలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక సృజనాత్మక ప్రయాణం ద్వారా దేశవ్యాప్తంగా మీ ప్రతిభను చాటుకునే అవకాశం ఇది. అంతే కాకుండా, పోటీలో విజేతలకు బహుమతులు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మొదటి బహుమతి రూ. 5 లక్షలు. అదేకాకుండా, స్కూల్, కాలేజ్, ప్రొఫెషనల్ స్థాయిల్లో వేర్వేరు విభాగాల వారికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నాయి. ప్రతి విభాగంలో ఐదుగురికి రూ. 50,000 చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు.
వీరు అర్హులు..
పోటీలో పాల్గొనడానికి అర్హత పొందినవారు మూడు విభాగాలలో భాగమవ్వచ్చు. మొదటి విభాగం పాఠశాల విద్యార్థుల కోసం. రెండవ విభాగం కళాశాల విద్యార్థుల కోసం. మూడవ విభాగం ప్రొఫెషనల్స్, డిజైన్ రంగంలో ఉన్నవారికి మాత్రమే. దీని వల్ల ప్రతి వయస్సు గల వ్యక్తికి ఈ పోటీలో సరియైన అవకాశాలు కలుగుతాయి.
ఈ పోటీలో పాల్గొనడానికి కావలసిన ముఖ్య అర్హతలలో ప్రధానమైనది కళాత్మక దృష్టి. మీరు తయారు చేసే డిజైన్ ఆధునికంగా ఉండాలి. గడియారం డిజైన్ భారతీయ సంస్కృతి, ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు దీన్ని చూసిన వెంటనే సమయం సులభంగా అర్థం చేసుకునేలా ఉండాలి. అంతేకాక, దీని రూపం వినూత్నంగా ఉండాలి. చూడగానే ఇది భారతీయ రైల్వే గడియా అని గుర్తుపడేలా ఉండాలి.
ఎలా అప్ లోడ్ చేయాలంటే?
మీరు రూపొందించిన డిజైన్‌ను మే 31, 2025లోగా సమర్పించాలి. ఇందుకోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.indianrailways.gov.in ను సంప్రదించండి. అక్కడ మీ డిజైన్‌ను అప్‌లోడ్ చేయడానికి ప్రత్యేక మెనూ ఉంటుంది. సమర్పించే డిజైన్ ఫార్మాట్, పరిమాణం, ఫైల్ టైప్ వంటి సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌లో ఇవ్వనున్నారు.
ఈ పోటీలో గెలిచిన డిజైన్‌లు దేశవ్యాప్తంగా వేల స్టేషన్లలో అమలవుతాయి. అంటే మీరు రూపొందించిన గడియారం డిజైన్ ను రోజుకి లక్షలాది మంది చూస్తారు. మీ ప్రతిభకు ఇది ఒక జీవ గుర్తుగా నిలిచిపోతుంది. అలాగే, మీరు రైల్వే అభివృద్ధిలో భాగస్వాములవుతారు. ఒకప్పుడు మీరు ప్రయాణించే ట్రైన్లో కనిపించే గడియారం, మీరు తయారు చేసినదిగా ఉండటం నిజంగా గర్వించదగిన విషయం.
ఛాన్స్ ఇప్పుడే.. మిస్ చేసుకోవద్దు
ఇలాంటి పోటీలు యువతలోని ఆవిష్కరణకు మార్గం వేస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల నుంచి సలహాలు, డిజైన్లు ఆహ్వానించడం అరుదైన అవకాశం. అలాంటి ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీరు స్వయంగా దేశాభివృద్ధికి మీ వంతు కృషి చేయగలుగుతారు. ఈ పోటీలో మీ సృజనాత్మకతను, మీ కలల్ని, మీ టాలెంట్‌ను చూపించండి. మేకింగ్ ఆఫ్ డిజిటల్ ఇండియా లో మీ పేరును చాటండి.
ఈ అవకాశం మిస్ అయితే, మళ్లీ వస్తుందో లేదో చెప్పలేము. మీరు ఓ విద్యార్థి కావచ్చు, ఓ కళాకారుడు కావచ్చు, ఓ డిజైనర్ కావచ్చు.. కానీ ఈ పోటీతో మీరు భారతీయ రైల్వేల ప్రగతిలో భాగమవ్వచ్చు. మీ కళకు గౌరవం లభించడమే కాదు, గుర్తింపు, నగదు బహుమతి, పేరు ప్రతిష్ట అన్నీ మీవవుతాయి. ఇది కేవలం డిజైన్ పోటీ కాదు. ఇది మీ కలలకు రూపం ఇచ్చే వేదిక. దేశంతో కలసి మీరు ముందుకు సాగే అవకాశం. మన దేశ గడియాల రూపాన్ని మీరు మార్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ మెదడుకు పదును పెట్టండి.. సరియైన డిజైన్ తో మీ లక్ పరీక్షించుకోండి.