శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరకు అందాలను చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్టులతో అరకు ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా గుంటూరు, విజయవాడ, నంద్యాల సహా ఇతర ప్రాంతాల నుంచి అరకు లోయకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
ఎంపిక చేసిన తేదీలలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
⦿ అరకు-యలహంక స్పెషల్ (08551) నవంబర్ 13, 23 తేదీల్లో అందుబాటులోకి రానుంది. ఈ రైలు అరకులో మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:15 గంటలకు యలహంకకు చేరుకుంటుంది. ఈ మార్గంలో బొర్రా గుహలు, ఎస్ కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గూటి, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం లాంటి అందమైన, కీలకమైన స్టాప్‌లు ఉన్నాయి. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో యలహంక-అరకు (08552) స్పెషల్ పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ రైలు నవంబర్ 14, 24 తేదీల్లో మధ్యాహ్నం 1:30 గంటలకు యలహంక నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అరకు చేరుకుంటుంది.
⦿ అటు మరో జత ప్రత్యేక రైళ్లు (08555/08556) నవంబర్ 17, 24 తేదీలలో అరకు, యలహంక మధ్య నడుస్తాయి. తిరుగు ప్రయాణాలు నవంబర్ 18, 25 తేదీలలో షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ రైళ్లను పర్యాటకులను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
అరకు లోయ వ్యాలీ ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. ఇది తూర్పు ఘాట్లలో 911 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతాన్ని ఏపీ ఊటీగా పిలుస్తారు. ఇక్కడి పచ్చని కాఫీ ప్లాంటేషన్లు, అద్భుతమైన జలపాతాలు, పురాతన గుహలు, ఆదివాసీ సంస్కృతి పర్యాటకులను ఆకర్షిస్తాయి. విశాఖపట్నం నుంచి సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రదేశం, వీకెండ్ టూర్లను అనుగుణంగా ఉంటుంది.
Read Also: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే పోస్ట్ మాన్సూన్ సమయంలో అరకు అందాలు అద్భుతంగా ఉంటాయి. వేసవిలో చల్లగా ఉంటుంది. ఇక్కడ 15-25°C ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ, వర్షాకాలంలో ముఖ్యంగా జూన్-ఆగస్టు జలపాతాలు అద్భుతంగా కనిపిస్తాయి. అరకులో బోర్రా గుహలు, చాపరై జలపాతం, పద్మాపురం బాటానికల్ గార్డెన్స్, ఆదివాసీ మ్యూజియం, గలికొండ వ్యూపాయింట్, కటికి జలపాతం, మత్స్యగుండం, కాఫీ ప్లాంటేషన్లు, ఆనంతగిరి హిల్స్, త్యదా నేచర్ క్యాంప్ పర్యాటక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.
Read Also: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!