Pawan Kalyan : గత కొన్ని రోజులుగా థియేటర్స్ బందుకు కొంతమంది పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ నలుగురు కారణం అంటూ కొంతమంది తెలుగు సినిమా నిర్మాతల పేర్లు బయటకు వచ్చాయి. వారితోపాటు కొంతమంది జనసేన నేతలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు దీనికి సంబంధించి ఇదివరకే ప్రెస్ మీట్ కూడా పెట్టి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఇలాంటి పన్నాగం పన్నడం అనేది డిప్యూటీ సీఎంకు తీవ్రంగా బాధించిన విషయం అని చెప్పాలి. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటే తాను ఎంత స్థాయిలో ఇరిటేట్ అయ్యారు అర్థం అవుతుంది.
జనసేన నేత పై వేటు
శ్రీ అత్తి సత్యనారాయణ అనే జనసేన నేతపై వేటు విధించినట్లు జనసేన పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.అవాంచనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజక వర్గం ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది. అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దాదాపుగా 20 థియేటర్లు
జనసేన నేత అత్తి సత్యనారాయణకు జిల్లా వ్యాప్తంగా 20 సినిమా ధియేటర్లు ఉన్నట్లు సమాచారం. అనుశ్రీ సినిమాస్ పేరుతో దాదాపు 20 థియేటర్లు సత్యనారాయణ నడుపుతున్నారు. సొంత పార్టీలో ఉన్న వ్యక్తి పైనే వేటు విధించారు అంటే మిగతా వ్యక్తులపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్లు తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న స్ట్రెయిట్ ఫిలిం కావడంతో దీని మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా మొదటి పని చేశారు. కొన్ని కారణాలతో ఆయన తప్పుకోవడం వలన ఏ ఎమ్ రత్నం కొడుకు జయకృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. జూన్ 12న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
శ్రీ అత్తి సత్యనారాయణ మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది. pic.twitter.com/zSsXAwPLQM
— JanaSena Party (@JanaSenaParty) May 27, 2025