BigTV English

Indian Railway: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్!

Indian Railway: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్!

Visakhapatnam Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కల నెలవేరతోంది. విశాఖ‌ప‌ట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక స్టెప్ తీసుకుంది. రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వేశాఖ  టెండ‌ర్లు ఆహ్వానించింది. డిసెంబ‌ర్ 27లోగా టెండ‌ర్లు దాఖ‌లు చేయాల‌ని తెలిపింది. టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌ కంపెనీ కేవలం రెండేళ్ల‌లో నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని సూచించింది. విశాఖ రైల్వే జోన్ తో దేశంలో రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరనుంది.


టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేమంత్రి

ఫిబ్రవరి 27, 2019న అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి ప్రకటన ఇప్పుడు రూపుదాల్చుతోంది.  విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ ను షేర్ చేశారు. మొత్తం 12 అంతస్తులలో విశాఖ రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం కానుంది. టెండర్ డాక్యుమెంట్ ప్రకారం రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నాను. ఈ టెండర్ బిడ్డింగ్ ప్రక్రియ డిసెంబర్ 13న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 27 వరకు ముగుస్తుంది. టెండర్ దక్కించుకున్న సంస్థ 24 నెలల్లో ప్రాజెక్ట్‌ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.


ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే అవకాశం

ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో రైల్వే జోన్ శంకుస్థాపనకు సంబంధించిన ప్రస్తావన లేదు. కానీ, ఇప్పటి వరకు షెడ్యూల్ లో ఉన్న కార్యక్రమాలకు శంకుస్థాపని చేసిన తర్వాత, ప్రత్యేకంగా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.

విశాఖ రైల్వేజోన్ నిర్మాణంతో బోలెడు లాభాలు

సరికొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (విశాఖ రైల్వే జోన్) ఏర్పాటుతో బోలెడు లాభాలున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రైల్వే ఉద్యోగులకు సైతం ప్రయోజనం చేకూరనుంది. గతంతో పోల్చితే మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. విశాఖ ప్రాంతం ఆర్థికంగానూ బలోపేతం కానుంది.

విశాఖ రైల్వే జోన్ గురించి..

ప్రస్తుతం ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ గా ఏర్పాటు చేయనున్నారు. వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులోని ఒక భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో కలిపి, దాన్ని విజయవాడ డివిజన్ లో విలీనం చేస్తారు. వాల్తేరు డివిజన్‌ లోని మిగతా భాగాన్ని ఈస్ట్ కోస్ట్  కోస్తా రైల్వేజోన్‌ పరిధిలో రాయగడ డివిజన్‌  కేంద్రంగా ఏర్పాటుచేస్తున్న కొత్త డివిజన్‌ లో చేర్చనున్నారు. అటు సౌత్ సెంట్రల్ రైల్వేలో రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లు ఉంటాయని రైల్వే సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ 17 రైల్వే జోన్లు, 68 డివిజన్లను కలిగి ఉంది. విశాఖ రైల్వే జోన్ తో రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరనుంది.

Read Also: 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×