South Central Railway News: విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 25న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలోని తాడి, దువ్వాడ సెక్షన్ల లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేయనున్నారు. వీటికి ఎలాంటి ఆటంటకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రద్దు అయిన రైళ్లలో విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే(12717, 12718) రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే(17267, 17268) రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. గుంటూరు- విశాఖపట్నం మధ్య నడిచే(17239, 17240) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరోవైపు రాజమండ్రి- విశాఖపట్నం మధ్య నడిచే (07466, 07467) రైళ్లను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. అత్యవసర పనులు ఉన్న ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లనున్న నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విశాఖపట్నం-కొల్లాం నడుమ స్పెషల్ సర్వీసులను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. అటు శ్రీకాకుళం- కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
⦿ విశాఖపట్నం-కొల్లాం ప్రత్యేక రైలు
వైజాగ్ లో బయల్దేరే విశాఖపట్నం- కొల్లాం స్పెషల్ రైలు (08539) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు వైజాగ్ నుంచి బయల్దేరుతుంది. గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. అటు కొల్లాం- విశాఖపట్నం ప్రత్యేక రైలు(08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి గురువారం కొల్లాం నుంచి రాత్రి 7.35 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
Read Also: రూ. 5 కోసం కక్కుర్తి పడితే రూ. లక్ష బొక్క, రైల్వే సంస్థ షాకింగ్ డెసిషన్!
⦿ శ్రీకాకుళం రోడ్- కొల్లాం స్పెషల్ రైలు
శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్- కొల్లాం స్పెషల్ ఎక్స్ ప్రెస్ (08553) రైలు డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకు తన సేవలను అందించనుంది. ఈ రైలు ఆదివారాల్లో ఉదయం 6.00 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. అటు కొల్లాంలో బయల్దేరే కొల్లాం- శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ (08554) రైలు డిసెంబర్ 2 నుంని జనవరి 27 వరకు తన సేవలను అందిస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కొల్లాం నుంచి బయల్దేరి బుధవారం అర్థరాత్రి 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.
Read Also: 7 స్టార్ హోటల్ ను తలదన్నే లగ్జరీ రైలు, టికెట్ ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!