Brazil Bus Accident: బ్రెజిల్‌లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలోని మరుమూల పర్వత రహదారిపై బస్సు ప్రయాణిస్తుండగా.. ప్రమాదావశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలోని మారుమూల పర్వత రహదారివైపు.. యూనియో డాస్ పాల్మారెస్ పట్టణానికి సమీపంలో.. ప్రమాదవ శాత్తు బస్సు లోయలో పడి దాదాపు 22 మంది మృతి చెందగా.. మరొక వ్యక్తి(గర్భిణి స్త్రీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు బ్రెజిల్ మీడియా తెలిపింది. ప్రమాదంలో అనేక మంది తీవ్రంగా గయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటినా ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!
బస్సు సుమారు 60 అడుగు లోతులో పడినట్లు తెలుస్తోంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల నుండి మృతిదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇతర కారణాలా అని తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఎక్స్ వేదికగా X స్పందిస్తూ.. “బాధితులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు అలగోస్ రాష్ట్ర గవర్నర్ పాలో డాంటాస్ విషాదకర ఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.