BigTV English
Advertisement

Indian Railway: త్వరలో 17,000 నాన్ ఏసీ కోచ్‌లు.. గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి

Indian Railway: త్వరలో 17,000 నాన్ ఏసీ కోచ్‌లు.. గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి

రైల్వే ప్రయాణికులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 17,000 నాన్-ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారాయన. రిజర్వేషన్ లేని కోచ్ లలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త కోచ్ లను పట్టాలెక్కించబోతున్నట్టు తెలిపారు. ఇటీవల కాలంలో రైల్వేలో జనరల్ క్లాస్ కోచ్ ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రాబోయే ఐదేళ్లలో మరిన్ని అదనపు కోచ్ లు తీసుకొస్తామని అన్నారు.


జనరల్ కోచ్ లకు డిమాండ్..
భారతీయ రైల్వే ప్రతి రోజూ 69 లక్షలమంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుంది. వీరిలో దాదాపు 78శాతం మంది జనరల్ క్లాస్ కోచ్ లలో ప్రయాణించేవారే. మిగతా 22 శాతం మంది మాత్రమే ఏసీ కోచ్ లను ఇష్టపడుతున్నారు. ఏసీ కోచ్ లకు ఉన్న డిమాండ్ తో పోల్చి చూస్తే నాన్ ఏసీ కోచ్ లలో రిజర్వేషన్ కు ఎక్కువ పోటీ ఉంటోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో నాన్ ఏసీ కోచ్ లలో ప్రయాణించిన వారి సంఖ్య 609 కోట్లు కాగా, ఈ ఏడాది అది 651 కోట్లకు చేరిందని తెలిపారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. భారతీయ రైల్వేలో ఉన్న మొత్తం కోచ్ లు 82వేలు కాగా.. వీటిలో 70శాతం జనరల్, లేదా నాన్ ఏసీ కోచ్ లేనని.. వీటికి అదనంగా రాబోయే ఐదేళ్లలో మరో 17వేల కోచ్ లు అందుబాటులోకి తెస్తామని అన్నారు.

భారత్ లో రైల్వేలు పేద, మధ్యతరగతి వారికి ప్రధాన ప్రయాణ సాధనాలు. ఇప్పటికీ ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చి చూస్తే రైల్వే టికెట్ ధర తక్కవ కావడంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తుంటారు. అయితే రైళ్లలో కూడా ఏసీ కంపార్ట్ మెంట్ల టికెట్ రేట్లు ఎక్కువ. కానీ అక్కడ ప్రయాణించేవారి శాతం తక్కువ. వారితో పోల్చి చూస్తే అల్పాదాయ వర్గాల వారే రైల్వేకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చిపెడుతుంటారు. అందుకే నాన్ ఏసీ కోచ్ లకు ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని కొత్త వాటిని జతచేరుస్తున్నామన్నారు మంత్రి.


అమృత్ భారత్..
వందే భారత్ పూర్తిగా ఏసీ కోచ్ లతో నడుస్తుండగా.. ఇటీవల నాన్ ఏసీ అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇలాంటి 100 రైళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 144 వందే భారత్ రైళ్లుదేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇప్పటివరకు రైల్వేలో మొత్తం ఆక్యుపెన్సీ రేటు 105.03 శాతంగా ఉంది. అంటే 100మంది ప్రయాణించాల్సిన సందర్భంలో 105 మంది వెళ్తున్నారు. భారత రైళ్లు ఎంత కిక్కిరిసి ఉంటాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

రైల్వే ప్రమాదాలను నివారించేందుకు తీసుకొస్తున్న కవచ్ భద్రతా వ్యవస్థ గురించి కూడా మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో కీలక వివరాలు వెళ్లడించారు. ప్రస్తుతం 1,548 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థతో అనుసంధానించినట్టు చెప్పారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్‌లలో దాదాపు 3,000 రూట్ కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈనెలాఖరుకు దాదాపు 2,200 రూట్ కిలోమీటర్ల మేర ట్రాక్-సైడ్ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. భారతీయ రైల్వేలో ప్యాసింజర్ రైళ్ల సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019-20లో ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లు నడుస్తుండగా.. 2024-25లో వాటి సంఖ్య 13,940కి పెరిగింది.

Related News

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

IRCTC Air Travel: రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌తో విమాన ప్రయాణం.. విద్యార్థులు, ఉద్యోగులకు ఐఆర్‌సిటిసి ఎయిర్ ఆఫర్

Big Stories

×