Divya Vani: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి దివ్యవాణి (Divya Vani)ఒకరు. ఒకానొక సమయంలో ఆమని, దివ్యవాణి, రోజా వంటి వారందరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇక ఇటీవల కాలంలో దివ్యవాణి పూర్తిగా సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇక దివ్యవాణి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా నటి కిటికీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)గారితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు వీరిద్దరి కాంబినేషన్ లో ‘ ముత్యమంత ముద్దు’, ‘ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళా ‘, కిపెళ్లి పుస్తకంకి, ‘ లేడీస్ స్పెషల్ ‘ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటించారు.
శ్రీరస్తు.. శుభమస్తు పాట…
ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి పుస్తకం సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో “శ్రీరస్తు శుభమస్తు” అనే పాట ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పాలి. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన వీరిద్దరూ “మిస్టర్ పెళ్ళాం “(Mister Pellam)అనే సినిమాలో కూడా నటించాల్సి ఉండేదట. ఈ సినిమాలో కూడా దివ్యవాణి చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఈ సినిమాలో నేను నటించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని దివ్యవాణి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఆమనికి అవకాశం..
రాజేంద్ర ప్రసాద్ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు కానీ నేను ఈ సినిమాలో నటించడానికి వీలు లేదంటూ ఆయన దర్శక నిర్మాతలకు కూడా సూచించారు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమని(Aamani)ని హీరోయిన్గా తీసుకున్నారని దివ్యవాణి తెలియజేశారు. ఇప్పటికి నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోవడానికి గల కారణం మాత్రం తెలియదని దివ్యవాణి తెలియచేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)గురించి కూడా ఈమె మాట్లాడారు. అప్పట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు హీరోయిన్లకు ఉండేవని నన్ను సినిమా కథ చెప్పడానికి హోటల్ రూమ్ కి రమ్మని చెప్పేవారు అయితే నేనెక్కడికి వెళ్లినా అమ్మ నాతో పట్టే ఉండేదని తెలిపారు.
అంత సాహసం ఎవరు చెయ్యలేదు..
హోటల్ వెళ్లగానే పైనుంచి కింద వరకు చూసి అమ్మాయి బాగుంది మీరు వెళ్లి బయట కూర్చోండి తనతో మాట్లాడాలి అంటూ అమ్మకు చెప్పేవారు. కానీ నేను మాత్రం అమ్మను బయటకు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఆ సమయంలో వారి ఆలోచనలేంటో నాకర్థమయ్యే వయసు కాదు అయితే అమ్మ ముందుగానే వారి ఆలోచన విధానాన్ని గ్రహించి తనని అక్కడి నుంచి తీసుకువచ్చేదని తెలిపారు. మరి ఎవరైనా మిమ్మల్ని నేరుగా కమిట్మెంట్ గురించి అడిగారా అంటూ ప్రశ్న వేయడంతో నన్ను అలా అడిగితే నెక్స్ట్ సెకండ్ వాడు బ్రతికి ఉంటాడా అంత ధైర్యం ఎవరూ చేసే వాళ్ళు కాదు అంటూ ఈ సందర్భంగా దివ్యవాణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
Also Read: Anasuya Bharadwaj: నా బట్టలు నా ఇష్టం…మీ కేంటీ నొప్పి…అనసూయ సంచలన పోస్ట్!