E-Paper
Advertisement

Sankranthi Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!

Sankranthi Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!
Advertisement

Sankranti festival 2026 Trains: సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరుతున్నారు. పండుగ సమీపిస్తుండటంతో రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సంక్రాంతి పండుగకు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ చాలా రైళ్లలో.. ముఖ్యంగా గోదావరి ఎక్స్‌ ప్రెస్, విశాఖ ఎక్స్‌ ప్రెస్, దురంతో, వందే భారత్, ఈస్ట్ కోస్ట్, ఫలక్‌ నుమా, మహబూబ్‌నగర్ సహా  ఇతర రైళ్లలో భారీ వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నట్లు ప్రయాణీకులు చెప్తున్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లలో చాలా అన్ని రైళ్ల పరిస్థిఇ ఇలాగే ఉందంటున్నారు.

సంక్రాంతికి పెద్ద సంఖ్యలో ప్రయాణాలు

సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు భారీగా ప్రయాణాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులు రిజర్వ్ చేయబడిన బెర్తులను పొందేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను ముందుగానే ప్రకటించాలని రైల్వేకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు కుటుంబాలకు సంక్రాంతి ఒక ప్రధాన పండుగ కావడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లో స్థిరపడిన ఆంధ్రా వాసులు ప్రయాణాలు కొనసాగిస్తారు.

Advertisement

Read Also: గాల్లో ఉండగా.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం, 155 మంది ప్రయాణికులు సురక్షితం!

ప్రత్యేక రైళ్లను ముందుగా ప్రకటించాలని లేఖ

పండుగ సీజన్ కు ముందే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం జంక్షన్ కు ప్రత్యేక రైళ్లను, సంక్రాంతి తర్వాత తిరిగి వచ్చే రైళ్లను ప్రకటించాలని కోరుతూ.. జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (ZRUCC), తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్  రైల్వే బోర్డు ఛైర్మన్ కు లేఖ రాశారు.  జనవరి 9 నుంచి 13 వరకు సాధారణ రైళ్లలో ఖాళీలు లేవని చూపించే ఆధారాలను ఆయన సమర్పించారు. రైళ్లలో ఖాళీలు లేనందున, ప్రయాణీకులు అధిక ఛార్జీలు చెల్లించి, తరచుగా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన లేఖ కాపీలను దక్షిణ మధ్య రైల్వే (SCR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) జనరల్ మేనేజర్లు,  విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ కు కూడా పంపారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా రైళ్లను నడపడంతో పాటు ఏ రైళ్లు ఎప్పుడు నడుపుతారో ముందే ప్రకటించాలని ఈశ్వర్ కోరారు.

Advertisement

Read Also:  అలర్ట్.. రేపు ఈ విమానాశ్రయంలో 6 గంటల సేపు విమాన సేవలు బంద్, వెంటనే చెక్ చేసుకోండి!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×