E-Paper
Advertisement

ఓవైపు ఎండ, మరోవైన వాన.. ఇండిగో షాకింగ్ డెసిషన్!

ఓవైపు ఎండ, మరోవైన వాన.. ఇండిగో షాకింగ్ డెసిషన్!
Advertisement

Delhi Weather Disrupts Flights: దేశ రాజధానికి ఢిల్లీలో మారుతున్న వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో  ప్రయాణికులకు  కీలకమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కొన్ని విమానాల షెడ్యూళ్లు ఆలస్యం కావచ్చని, మరికొన్ని మార్పులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు X వేదికగా పోస్టు పట్టింది. ఢిల్లీలో వాతావరణం విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమానాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయని చెప్పింది.

ప్రయాణీకులకు కీలక సూచనలు  

ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఇండిగో సూచించింది. ఇందుకోసం తమ అధికారిక వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌ను ఉపయోగించాలని తెలిపింది. అలాగే, ఢిల్లీలో వర్షాలు, ట్రాఫిక్ కారణంగా రోడ్లపై ప్రయాణం నెమ్మదిగా ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే బయలుదేరాలని సూచించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో స్పష్టం చేసింది.

ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణ మార్పు

Advertisement

ఢిల్లీలో ఇటీవల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ(IMD) తెలిపిన వివరాల ప్రకారం,    సాయంత్రం నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మేఘావృత ఆకాశం, తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. కానీ, ఆ తర్వాత మళ్లీ వేడి పెరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ఢిల్లీలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39°C నుంచి 42°C వరకు ఉండవచ్చని, కనిష్ట ఉష్ణోగ్రతలు 20°C నుంచి 24°C మధ్య ఉండవచ్చని IMD తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.

ప్రజల ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం  

వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా ఉండటం, తేలికపాటి దుస్తులు ధరించడం, తలకు క్యాప్ వాడటం, తరచూ నీరు తాగడం లాంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని IMD శాస్త్రవేత్త డాక్టర్ శశి కాంత్ తెలిపారు. అయితే, కొంతకాలం పాటు ఉత్తర భారతంలో వేడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

అటు ఢిల్లీలో వాతావరణ మార్పులు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఫ్లైట్ వివరాలను తరచూ చెక్ చేసుకోవడం అవసరమన్నారు.

Read Also: అసలే ఆలస్యం, ఆపై నో ఏసీ.. ప్రయాణీకులకు చుక్కలు చూపించిన ఇండిగో!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×