E-Paper
Advertisement

చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!

చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లకు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటిపై దాడి చేసిన ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ముఖ్యంగా ఇందుకు కారణమైన చంద్రబాబు, లోకేశ్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిని జైలుకు పంపేవరకూ తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

అంబటి నిరాహార దీక్ష

కస్టడీలో తనను హింసించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు.. శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైసీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా తిరిగి తననే 18 రోజులు రాజమండ్రి జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని.. ఇందుకు పూనుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని అంబటి పట్టుబట్టారు.

Advertisement

 

‘వదిలిపెట్టే ప్రసక్తే లేదు’

Advertisement

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పెమ్మసాని ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో గతంలో ఎప్పుడూ ఈ విధమైన దాడులు జరగలేదని పేర్కొన్నారు. నేతల ఇళ్లపై దాడులు చేసే విష సంస్కృతిని కేంద్ర మంత్రి పెమ్మసాని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే.. పెమ్మసాని తిరిగి స్పెషల్ ఫ్లైట్ లో అమెరికాకు రిటర్న్ అవుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. టీడీపీ నేతలు ఎవరూ తనను భయపెట్టలేరని అంబటి పేర్కొన్నారు.

‘కూటమి దుర్మార్గాలకు పవన్ మద్దతు’

ఇప్పటికైనా తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనను హింసించిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించాలని కలెక్టర్ రేట్ ఎదుట అంబటి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఐలని సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత అయినా చట్టబద్దంగా వ్యవహరించాలని ప్రభుత్వ యంత్రాగానికి సూచించారు. తనపై జరిగిన దాడిపై న్యాయపోరాటం కొనసాగిస్తాని ఈ సందర్భంగా అంబటి స్పష్టం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇంకా మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని అంబటి చెప్పుకొచ్చారు.

Also Read: Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!

అంబటి ఇంటిపై దాడి నేపథ్యం!

కాగా, సీఎం చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కొద్దిరోజుల క్రితం గుంటూరులోని నవభారత్ నగర్ లోని అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించారు. దీంతో ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు సీఎంపై పలుష పదజాలంతో దూషించారన్న ఫిర్యాదుపై జనవరి 31న పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా.. ఫిబ్రవరి 10న ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.

Also Read: మీ జీరో పర్సనాలిటీని హీరో మార్చే గోల్డెన్ రూల్స్.. ఈ రోజు నుంచే పాటించండి

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×