E-Paper
Advertisement

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోమంటలు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు, అసలేం జరిగింది?

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోమంటలు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు, అసలేం జరిగింది?
Advertisement

Rajdhani Express: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో త్రివేండ్రం-నిజాముద్దీన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్‌ నుంచి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వెనుక అసలేం జరిగింది?

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Advertisement

తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431)లోని ఓ ఏసీ కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొలుత కంపార్ట్‌మెంట్ నుండి పెద్ద ఎత్తున మంటలు రావడం గమనించాడు రైలు గార్డు. వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో రైలును నిలిపి వేశాడు. ఆ తర్వాత ప్రయాణికులను ఆ బోగీ నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది.

ఘటన సమయంలో ఆ కోచ్‌లో 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున దాదాపు ఐదున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ మధ్య రైల్వే కోటా డివిజన్ పరిధిలోని లూని రిచా-విక్రమ్‌గఢ్ అలోట్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి తెలియగానే రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు.. అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది

బోగీల్లోని ప్రయాణికులను కిందకు దించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అంతకముందు మంటల బోగీలను రైలు నుంచి వేరు చేశారు రైల్వే సిబ్బంది. అయితే ఎలాంటి ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. ఈ ఘటన నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. కోటా వరకు ప్రయాణం కోసం ప్రయాణికులకు ఇతర కోచ్‌లలో ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. కోటా స్టేషన్‌లో ఒక అదనపు కోచ్‌ను జత చేస్తామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ:  వాష్‌ రూమ్ పక్కనే భోజనం చేస్తున్న రైల్వే అటెండెంట్.. నిజంగా దారుణం భయ్యా!

 

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×