E-Paper
Advertisement

వాష్‌ రూమ్ పక్కనే భోజనం చేస్తున్న రైల్వే అటెండెంట్.. నిజంగా దారుణం భయ్యా!

వాష్‌ రూమ్ పక్కనే భోజనం చేస్తున్న రైల్వే అటెండెంట్.. నిజంగా దారుణం భయ్యా!
Advertisement

రైలు ప్రయాణాల్లో చాలా మంది సాధారణంగా సీటు, భోజనం, ఏసీ, సమయానికి గమ్యానికి చేరుకోవడం లాంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. కానీ, ఆ ప్రయాణాన్ని సౌకర్యంగా మార్చేందుకు వెనుక ఎంతమంది కష్టపడుతున్నారో పెద్దగా ఆలోచించరు. తాజాగా ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందినీ ఆలోచింపజేస్తున్నాయి. నిజంగా వాళ్లు ఇంత దుర్భర జీవితాన్ని గడుపుతారా? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఓ ఏసీ కోచ్‌ లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్యాసింజర్ రైల్వే అటెండెంట్ ను గమనించాడు. ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కోచ్‌ లోని ప్రయాణికులకు నిరంతరం సహాయం చేస్తూ తిరిగే అటెండెంట్, తను మాత్రం భోజనం చేయడానికి కోచ్ తలుపు దగ్గర, వాష్‌ రూమ్ పక్కన కూర్చున్నాడని ఆయన రాసుకొచ్చాడు. సాధారణంగా ప్రయాణికులు ఒక్క నిమిషం కూడా నిలబడటానికి ఇష్టపడని ఆ ప్రదేశమే, ఆ ఉద్యోగికి గంటల తరబడి పనిచేసే స్థలంగా మారిందని రాసుకొచ్చాడు.

Advertisement

రాత్రింబవళ్లు ప్రయాణికుల అవసరాలు చూసుకోవడం, బెడ్‌ షీట్లు ఇవ్వడం, సమస్యలు పరిష్కరించడం, కోచ్ పరిశుభ్రతపై దృష్టి పెట్టడం లాంటి ఎన్నో పనులు చేసే  సిబ్బంది పరిస్థితి గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రయాణికుల సౌకర్యం కోసం పనిచేసే వాళ్లకు కనీసం విశ్రాంతి తీసుకునే సరైన స్థలం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. “మనకు సేవ చేసే వారిని కూడా మనుషుల్లాగే చూడాలి”, “ఇలాంటి సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే రైల్వే శాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు. రైల్వే మంత్రికి ట్యాగ్ చేస్తూ, వారికి సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త వందే భారత్ రైళ్లు, స్టేషన్ అప్‌గ్రేడ్లు, హైటెక్ సదుపాయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, ఈ వ్యవస్థను నడిపించే సిబ్బందికి మంచి విశ్రాంతి, భోజనం చేసే ప్రదేశాన్ని ఏర్పాటు చేయలంటున్నారు. కొంతమంది ప్రయాణికులు తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. చాలా సార్లు అటెండెంట్లు తలుపుల దగ్గరే కూర్చోవడం, అక్కడే భోజనం చేయడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం చూసినట్లు చెబుతున్నారు. అయితే, దీనిపై ఎప్పుడూ పెద్దగా చర్చ జరగలేదని అంటున్నారు.  రోజుకు వందలాది మంది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే రైల్వే సిబ్బందికి సరైన వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటున్నారు.

Read Also: ఓయో రూమ్ లా మారిపోయిన రైల్వే రెస్ట్ రూమ్.. అబ్బా ఏం వాడకం గురూ!

Related News

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

జూలైలో పర్యటించడానికి 6 అందమైన ప్రదేశాలు.. చల్లని, స్వచ్ఛమైన గాలితో మైమరిపించే వాతావరణం

Big Stories

Advertisement
×