BigTV English

Vande Bharat Train Pilot: వందే భారత్ పైలట్ డ్యూటీ సీక్రెట్స్.. అంత ఈజీ కాదు భయ్యా!

Vande Bharat Train Pilot: వందే భారత్ పైలట్ డ్యూటీ సీక్రెట్స్.. అంత ఈజీ కాదు భయ్యా!

Vande Bharat Train Pilot: ఇప్పుడు ఎక్కడ చూసినా, వందే భారత్ ట్రైన్స్ హవా నడుస్తోంది. ఇండియన్ రైల్వేలో ఇదొక అద్భుతం. రైలు బండి.. రైలు బండి వేళకంటూ రాదు అండీ అనే స్థితి నుండి, ఇండియన్ రైల్వే టైమ్ టు టైమ్ వందేభారత్ రైళ్లను నడుపుతూ ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా 130 కి పైగా వందే భారత్ రైళ్లు ప్రస్తుతం ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అలాగే త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయితే ఇక్కడ అందరికీ ఒక్క ప్రశ్న మదిలో మెదులుతుంది.


సాధారణ రైలు నడిపే లోకో పైలట్ కి, వందే భారత్ నడిపే పైలట్ కు ఏంటి తేడా? అసలు వందే భారత్ నడిపే ముందు అంటే డ్యూటీకి వచ్చే ముందు పైలట్ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటారన్నది అసలు ప్రశ్న. వందే భారత్ సుమారు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో నడిచే రైలు. అంతేకాదు ఈ రైలు ఎక్కే ప్రయాణికులు వేలల్లో ఉంటారు. అలాంటి సమయంలో వందే భారత్ ప్రయాణీకుల రక్షణ భాద్యత మొత్తం లోకో పైలట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఇండియన్ రైల్వే వందేభారత్ ట్రైన్స్ నడిపేందుకు వచ్చే పైలట్స్ కి పలు పరీక్షలు తప్పక నిర్వహిస్తుంది. అవేమిటో తెలుసుకుందాం.

వేగంగా పరుగులు తీసే వందే భారత్ ట్రైన్ ను చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రశ్న కలుగుతుంది. ఈ హైస్పీడ్ ట్రైన్‌ను నడిపే లోకోపైలట్ ఏ స్థాయిలో పరీక్షలు ఎదుర్కొంటాడు? నిజంగా చూస్తే, ఇది కేవలం ట్రైన్ డ్రైవింగ్ కాదు, అది ప్రాణాలను భద్రంగా గమ్యానికి చేర్చే బాధ్యత. అందుకే, వందే భారత్ ట్రైన్ పైలట్ (Train Pilot) డ్యూటీకి వెళ్లే ప్రతి రోజు ముందు, సెక్యూరిటీ, హెల్త్, అలర్ట్‌నెస్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించబడతాయి.


డ్యూటీకి ముందు బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్..
వందే భారత్ పైలట్ కు డ్యూటీ వెళ్లకముందు, బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేస్తారు. శరీరంలో ఏమైనా ఆల్కహాల్ ట్రేస్ కనిపించినా, డ్యూటీకి అనర్హుడే. దీనిని రైల్వే శాఖ Zero Alcohol Policy కింద చాలా కఠినంగా అమలు చేస్తోంది. పైలట్ నైతికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాడని నిర్ధారించేదే ఈ పరీక్ష.

ఆరోగ్య పరీక్షలు.. మినీ మెడికల్ చెకప్
ప్రతి పైలట్‌కు డ్యూటీకి ముందు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పూరించాల్సి ఉంటుంది. ఇందులో తమకు తలనొప్పి, వాంతులు, నిద్రలేమి, ఒత్తిడి లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అనే అంశాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ట్రైన్ పైకి ఎక్కే అర్హత ఉంటుంది.

మానసిక పరిస్థితి..
అలసట, ఒత్తిడి, కోపం స్వభావాలు పైలట్‌ను తప్పుదారిలో నడిపే కారకాలు కావచ్చు. అందుకే డ్యూటీకి ముందు, అధికారులు పైలట్ స్పష్టంగా స్పందిస్తున్నాడా? సమాధానాలు వెంటనే ఇస్తున్నాడా? అనే అంశాలను స్వల్పంగా గమనిస్తారు. దీనినే Alertness Test అంటారు.

డ్యూటీ డాక్యుమెంటేషన్
ఒక్కో ట్రైన్‌కు ప్రత్యేకంగా రూట్ పత్రాలు, ఆ డేస్ ఆర్డర్స్, లోకో రిపోర్ట్‌లు, వాతావరణ సూచనలు, సిగ్నల్ స్టేటస్ అన్నీ పైలట్‌కు అందిస్తారు. పైలట్ ఈ సమాచారం పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ఎలాంటి డైవర్షన్ ఉన్నా, ముందుగానే తెలుసుకోవాలి.

ట్రైన్ చెక్..
ట్రైన్ స్టార్ట్ చేసే ముందు లోకో పైలట్ తానే ట్రైన్‌ను పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. బ్రేకులు పనిచేస్తున్నాయా? హెడ్‌లైట్స్, హార్న్, కమ్యూనికేషన్ వ్యవస్థ బాగున్నాయా?సిగ్నలింగ్ ప్యానెల్ స్పష్టంగా పని చేస్తుందా? ఏ చిన్న లోపం ఉన్నా, ట్రైన్ డ్యూటీ ప్రారంభించరు. ఇది ట్రైన్‌కు హెల్త్ చెక్ అని చెప్పవచ్చు.

ట్రైనింగ్ సర్టిఫికేషన్..
వందే భారత్‌ ట్రైన్ లాగా అత్యాధునిక ట్రైన్స్‌ కోసం ప్రత్యేకంగా అధునాతన ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ సిములేటర్ ట్రైనింగ్, ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్, హైస్పీడ్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ జ్ఞానం ఇచ్చేలా శిక్షణ ఇస్తారు. వర్షం, పొగమంచు, ఎండ వాతావరణం ఏదైనా వదిలిపెట్టే ఛాన్స్ లేదు. వందే భారత్ పైలట్‌కు వాతావరణ ఆధారంగా ట్రైన్ కంట్రోల్ చేసే నైపుణ్యం కావాలి. ముఖ్యంగా రాత్రిపూట డ్యూటీలు ఉంటే, రాత్రి విజిబిలిటీ, ట్రాక్ క్లియర్‌నెస్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.

Also Read: Vande Bharat Express: వందేభారత్ లేని రైలు ప్రయాణం.. ఒక్కసారి ఊహించండి.. ఇక అంతే సంగతులు!

వందే భారత్ ట్రైన్ అంటే మన యావత్ దేశం మొత్తం గర్వించే ట్రైన్. కానీ ఆ ట్రైన్ సురక్షితంగా ముందుకు సాగడానికి ఉండాల్సింది ఒక అప్రమత్తత గల పైలట్. రైలు వేగంగా పరిగెత్తాలంటే, దానిని నడిపే మనిషి అంతకంటే వేగంగా ఆలోచించాలి. అదే వందే భారత్ లోకోపైలట్ నిజమైన వైభవం. అందుకే ఇండియన్ రైల్వేకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్న పైలట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×