YS Jagan: మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున బలమైన పోరాటాలు చేస్తాం. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, మంచి రోజులు వస్తాయి. పాత కేసులను తవ్వి వైసీపీ నేతలను ఇరికిస్తున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
Also Read: IHMCL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. ఈ అర్హత ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..
‘చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కల్పిత సాక్షాలతో కేసులు పెడుతున్నారు. కార్యకర్తలు పడుతున్న కష్టాలను చూస్తున్నా. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తాం. కార్యకర్తలపై వేధింపులను వింటుంటే ఆవేదన కలుగుతోంది’ అని జగన్ తెలిపారు.
Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..