BigTV English

Vande Bharat Express: వందేభారత్ లేని రైలు ప్రయాణం.. ఒక్కసారి ఊహించండి.. ఇక అంతే సంగతులు!

Vande Bharat Express: వందేభారత్ లేని రైలు ప్రయాణం.. ఒక్కసారి ఊహించండి.. ఇక అంతే సంగతులు!

Vande Bharat Express: ఇండియన్ రైల్వేలో వందే భారత్‌ ట్రైన్స్ రంగప్రవేశంతో ప్రయాణికులకు ఒక నూతన అనుభవం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ట్రైన్లు ఇప్పుడు లేకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఊహించగలమా? వేగం, సౌలభ్యం, సాంకేతికత అన్నీ వెనకబడిపోయేవే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 130కి పైగా వందే భారత్‌ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇవి లేకుంటే ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు ఊహిస్తేనే కష్టం.


విదేశాలకు మించి మరీ..
మన ఇండియన్ రైల్వే ప్రతి విషయంలో విజయాలను అందుకుంటోంది. విజయవంతంగా ఎప్పటికప్పుడు ఆధునికతను అందుకుంటూ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. విదేశాలలో హై స్పీడ్ రైళ్లు చక్కర్లు కొట్టే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం, మన టెక్నాలజీతో వందే భారత్ రైళ్లను రంగంలోకి దించి మరీ ఇండియన్స్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

ప్రయాణ సమయం
వందే భారత్‌ ట్రైన్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి వేగవంతంగా గమ్యస్థానానికి చేరతాయి. సాధారణంగా ఒక ప్రయాణాన్ని 6 గంటల్లో ముగించే వందే భారత్ ట్రైన్‌ స్థానంలో సాధారణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను తీసుకుంటే అదే ప్రయాణానికి 9 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ప్రయాణ సమయం 30 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే ప్రమాదం. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ, విశాఖపట్నం – తిరుపతి వంటి మార్గాల్లో ఇది స్పష్టంగా మనకు కనిపిస్తుంది.


వందే భారత్‌ ట్రైన్లు ఆధునిక ప్రయాణానికి నాంది పలికాయి. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, రెక్లైనింగ్ సీట్లు, హైజీనిక్ టచ్‌లెస్ టాయిలెట్లు, ఫుడ్ సర్వీస్, WiFi వంటి టెక్ సదుపాయాలు ఉన్నాయి. ఇవి లేకుండా సాధారణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ప్రయాణం అసౌకర్యంగా మారుతుంది. సుదూర ప్రయాణాల్లో ఈ అంశం మరింత బాధ్యతకరంగా మారుతుంది.

హై స్పీడ్..
వందే భారత్ ట్రైన్లు నేరుగా ప్రయాణించడంలో ముందుంటాయి. స్టేషన్ల పరిమితి కారణంగా కనెక్టింగ్ అవసరం ఉండదు. కానీ వందే భారత్ లేకపోతే, చిన్నచిన్న మార్గాల్లో పలు బ్రేకులు, కనెక్టింగ్ ట్రైన్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రయాణం సంక్లిష్టంగా మారుతుంది.

వృద్ధులకు అసౌకర్యం ఖాయం..
వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపార ప్రయాణికుల కోసం వందే భారత్ అనేది టాప్ ఛాయిస్. క్లాసిక్ కంఫర్ట్‌తో పాటు టైమ్ సేవింగ్ కూడా అందిస్తాయి. ఇవి లేకపోతే, ఈ కేటగిరీ ప్రయాణికులు ఎయిర్ ట్రావెల్ వైపు మొగ్గుచూపడం, రైల్వే ఆదాయానికి దెబ్బ అనే పరిణామాలు తలెత్తుతాయి.

Also Read: Passengers Alert: వందేభారత్ ట్రైన్ లో ఇలా చేస్తే.. ఆన్ ది స్పాట్ జైలుకే!

టెక్నాలజీ నుంచి వెనకడుగు
వందే భారత్ ట్రైన్లు భారత రైల్వే ఆధునికీకరణకు మార్గదర్శకంగా నిలిచాయి. ఇవి లేకపోతే, భారత రైల్వే ఇప్పటికీ పాత డిజైన్ ట్రైన్లకే పరిమితమయ్యేది. టెక్నాలజీ కలయిక లేకుండా, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రవాణా రంగంలో భారత్ వెనుకబడే ప్రమాదం ఉండేది.

మొత్తంగా చెప్పాలంటే.. వందే భారత్ ట్రైన్లు లేకపోతే వేగవంతమైన ప్రయాణం అసాధ్యమవుతుంది. సౌకర్యాలు తగ్గిపోయి ప్రయాణం అలసటగా మారుతుంది. టెక్నాలజీ అనుభవాన్ని మనం కోల్పోతాం. ప్రయాణంలో సమయం వృథా అవుతుంది. ఉద్యోగులు, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు రైల్వే ఆదాయం కోల్పోతుంది. ఇవన్నీ చూస్తే, వందే భారత్ లేకపోతే ఇండియన్ రైల్వేకు బలంగా చెప్పవచ్చు. ఈ రైళ్లు ఇప్పుడు హై స్పీడ్ తో రాకపోకలు సాగిస్తున్నందుకే, ప్రయాణికుల ఎన్నో కష్టాలకు ఎండ్ కార్డు పడిందని చెప్పవచ్చు.

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×