Surya Gochar 2025: గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మే 15వ తేదీ రాత్రి 12:11 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో దాదాపు 30 రోజులు ఉండబోతున్నాడు. సూర్యుడు కూడా మే 25న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు.. కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. ఇదిలా ఉంటే సూర్యుడి సంచారం కొంతమందికి సమస్యలను తెచ్చి పెడుతుంది. సూర్యుడు ఆత్మ, గౌరవం, నాయకత్వ సామర్థ్యాన్ని సూచించే గ్రహంగా చెబుతారు. ఇలాంటి పరిస్థితిలో ఈ మూడు రాశుల వ్యక్తులు తమ కెరీర్‌లో ఆత్మవిశ్వాసం కోల్పోవడంతో పాటు.. సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
సూర్యుని రాశిలో మార్పు కారణంగా.. మీ ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా మీ ఆఫీసుల్లో కొత్త సమస్యలు పెరుగుతాయి. మీ చుట్టూ నివసించే వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారు మరికొంత సమయం వేచి ఉండటం మంచిది. ప్రభుత్వ పనులను పూర్తి చేయడంలో అడ్డంకులు కూడా కొనసాగుతాయి. కోర్టు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తులా రాశి:
తులా రాశి వ్యక్తుల తప్పులు వారి కుటుంబ సభ్యుల ముందు బయటపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతే కాకుండా కుటుంబ సభ్యుడు చెప్పే దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. విద్యార్థులు చదువులో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగం చేసేవారికి జీతం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: గరుడ పురాణం ప్రకారం.. ఈ పనులు చేస్తే అర్ధాయుష్షు
కుంభ రాశి:
ఈ సమయంలో మీరు తెలివిగా మాట్లాడాలి. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల మేధో , మానసిక భారం పెరిగే అవకాశం కూడా ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన చర్చలకు మరికొంత సమయం పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి.