LSG VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి స్టేడియం వేదికగా ఈ బిగ్ ఫైట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ వికెట్ల నష్టానికి 159 పరుగులు వచ్చేసింది. రవీంద్ర జడేజా రనౌట్ మిస్ అయిన నేపథ్యంలో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. లేకపోతే 120 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది.
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Lucknow Super Giants vs Rajasthan Royals ) మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా మొదట బ్యాటింగ్ రియాన్ పరాగ్ సేన చేసింది. ఈ సందర్భంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. కానీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం 29 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. అయితే రవీంద్ర జడేజాను రనౌట్ చేసే అవకాశం వచ్చినా కూడా చేజేతులా పోగొట్టుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రనౌట్ ఛాన్స్ మిస్ చేసుకుంది లక్నో. రవీంద్ర జడేజా…నికోలస్ పూరన్ వైపు భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్ల మధ్య మిస్ కమ్యూనికేషన్ చోటు చేసుకుంది.
దీంతో జడేజా, డోనోవన్ ఫెరీరా ఇద్దరు బౌలర్ ఎండు వైపు పరుగెత్తారు. ఈ తరుణంలోనే నికోలస్ పూరన్ వేసిన త్రో ను అందుకోబోయి, బెయిల్స్ పడేసి డైవ్ కొట్టాడు రిషబ్ పంత్. ఆ తర్వాత అలర్ట్ అయిన ముకుల్ చౌదరీ కూడా రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఫెరీరా క్రీజులోకి చేరారు. బెయిల్స్ పడకపోయి ఉంటే, కచ్చితంగా ముకుల్ చౌదరీ రనౌట్ చేసేవాడు. పంత్, పురన్ చేసిన పని వల్ల రనౌట్ మిస్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫీల్డర్ల లాగానే లక్నో ప్లేయర్లు తయారయ్యారని సెటైర్లు పేల్చుతున్నారు.
రనౌట్ మిస్సయిన నేపథ్యంలో రవీంద్ర జడేజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ లలో 29 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా 43 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో ఒక శిక్ష అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. ఈ 43 పరుగులే రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించేలా కనిపిస్తున్నాయి.
Rishabh Pant 1st dislodged the stumps, the batter was not even in the frame but still they didn't make him run out. PSL things in IPL 😭 pic.twitter.com/A1UoBCKv8W
— Vitamin K(ohli) (@TheeDefender) April 22, 2026
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==