BigTV English

Long Drive: లవర్‌తో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్..

Long Drive: లవర్‌తో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్..

Long Drive: లవర్‌తో అలా బయటకు వెళ్లి రావాలని చాలా మంది అనుకుంటారు. కానీ, సిటీలో ఎక్కడికి వెళ్లినా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దీంతో ప్రైవసీ కావాలనుకునే వారు ప్రశాంతంగా ఉండే ఒక ఎస్కేప్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. హైదరాబాద్‌కు కొంచెం దూరంలో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలి అనుకున్నా.. మంచి డెస్టినేషన్ ఏంటో తెలియక సతమతమైపోతారు. అలాంటి వారి కోసం సటీ అవట్ స్కట్స్‌లోనే ఓ మంచి ప్లేస్ ఉంది.


హైదరాబాద్ నుంచి జస్ట్ 140 కి.మీ. దూరంలో, కర్ణాటకలోని బీదర్ జంటలకు ఓ కూల్ రొమాంటిక్ డెస్టినేషన్‌గా మారిపోయింది. చరిత్ర, ప్రశాంతత, స్వీట్ మూమెంట్స్ మిక్స్‌తో ఈ చిన్న పట్టణం రష్ లేని, చిల్ వైబ్‌ని ఆఫర్ చేస్తుంది. పురాతన కోటలు, పవిత్ర స్థలాలు, ఓల్డ్ వరల్డ్ చార్మ్‌తో బీదర్ జంటలకు రిలాక్సింగ్ ఎస్కేప్ ఇస్తోంది.

రొమాంటిక్ వాక్‌కి పర్ఫెక్ట్
బీదర్ మధ్యలో ఉన్న బీదర్ కోట సూపర్ స్టన్నింగ్‌గా ఉంటుంది. 15వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ అహ్మద్ షా వలీ బిల్డ్ చేసిన ఈ కోటలో 30కి పైగా ప్యాలెస్‌లు, మసీదులు, గార్డెన్స్ వంటి స్మారకాలు ఉన్నాయి. మీ పార్టనర్‌తో స్లో వాక్‌కి ఇది బెస్ట్ స్పాట్. గ్రాండ్ ఆర్చ్‌లు, పర్షియన్ డిజైన్స్, క్వైట్ కార్నర్స్ రొమాంటిక్ వైబ్‌ని క్రియేట్ చేస్తాయి. రంగీన్ మహల్‌లోని కలర్‌ఫుల్ టైల్స్, మదర్-ఆఫ్-పెర్ల్ డెకరేషన్ చూస్తే కళ్లు తిప్పుకోలేం. క్రౌడ్ లేకపోవడంతో ఈ కోటలో చిల్ వైబ్‌లో అన్‌ఫర్గెట్టబుల్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు.


పీస్‌ఫుల్ వైబ్
స్పిరిచువల్ టచ్ కావాలంటే, గురుద్వారా నానక్ ఝిరా సాహిబ్ మస్ట్ విజిట్. సౌత్ ఇండియాలో టాప్ సిక్కు యాత్రా స్థలాల్లో ఒకటైన ఈ గురుద్వారా 1948లో బిల్డ్ అయింది. మొదటి సిక్కు గురు నానక్ దేవ్ జీకి డెడికేటెడ్ ఈ ప్లేస్‌లో 1512లో గురు నానక్ రాయి తాకి అమృత కుండ్ అనే స్వీట్ వాటర్ స్ప్రింగ్ క్రియేట్ చేశారని స్టోరీ. వైట్ మార్బుల్ బిల్డింగ్, కీర్తనల సౌండ్, చిల్ వైబ్ జంటలకు పీస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. లంగర్‌లో ఫ్రీ కమ్యూనిటీ మీల్ ఎంజాయ్ చేయొచ్చు, సరోవర్ (పవిత్ర పూల్) రిలాక్సింగ్ వైబ్ ఇస్తుంది.

హిస్టరీ లవర్స్‌కి ట్రీట్
బీదర్ నుంచి 3 కి.మీ. దూరంలో అష్టూర్‌లో ఉన్న బహమనీ సమాధులు కళ్లు చెదిరేలా ఉంటాయి. 12 గ్రాండ్ సమాధులు, డోమ్స్, ఆర్చ్‌లు, స్టన్నింగ్ టైల్ వర్క్‌తో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌ని షో చేస్తాయి. అహ్మద్ షా సమాధి దాని పెయింటింగ్స్, బిగ్ ఇంటీరియర్స్‌తో స్పెషల్. క్వైట్ సరౌండింగ్స్‌లో జంటలు హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఓల్డ్ టైమ్స్ గ్రాండర్‌ని ఫీల్ అవ్వొచ్చు.

బీదర్ చార్మ్ ఎక్కడుంది?
బీదర్‌లో స్లో పేస్, నాన్-కమర్షియల్ వైబ్ జంటలకు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. బీదర్ బిద్రీవేర్‌కి కూడా ఫేమస్, సావనీర్‌గా పర్ఫెక్ట్. లోకల్ మార్కెట్స్‌లో షికారు చేస్తూ ఈ క్రాఫ్టెడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు.

ఎలా వెళ్లాలి?
బీదర్ విజిట్‌ వెదర్ కూల్, అవుట్‌డోర్ ఎక్స్‌ప్లోరింగ్‌కి సూపర్. హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్ (NH65 ద్వారా 3 గంటలు) లేదా బీదర్ రైల్వే స్టేషన్‌కి ట్రైన్ ఈజీ. ఫ్లైట్ వాళ్లకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ 140 కి.మీ. దూరంలో ఉంది. బడ్జెట్, మిడ్-రేంజ్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. పక్కనే ఉన్న గురుద్వారా చీప్, క్లీన్ స్టే ఆప్షన్ ఇస్తుంది.

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×