Jobs in Medical College: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. జోగులాంబ గద్వాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎంఎస్/ఎండీ, ఎంసీహెచ్, డీఎం పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జోగులాంబ గద్వాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్(Govt. Medical College Jogulamba Gadwal) ఒప్పంద విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 28వ తేదీ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 34
జోగులాంబ గద్వాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, అనస్థీషియా, ఎస్‌పీఎం, డీవీఎల్, ఫారెన్సిక్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, రేడియో డయాగ్నోసిస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 10 ఉద్యోగాలు
సీనియర్ రెసిడెంట్ : 19 ఉద్యోగాలు
ట్యూటర్ : 5 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్ బీ, ఎంఎస్/ఎండీ, ఎంసీహెచ్, డీఎ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 మార్చి 31వ తేది నాటికి 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,25,000 జీతం ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగానికి నెలకు రూ.92,575 జీతం ఉంటుంది. ట్యూటర్ ఉద్యోగానికి రూ.55,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ డేట్: 2025 మే 28
ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, జోగులాంబ గద్వాల
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://gadwal.telangana.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,25,000 జీతం ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగానికి నెలకు రూ.92,575 జీతం ఉంటుంది. ట్యూటర్ ఉద్యోగానికి రూ.55,000 జీతం ఉంటుంది.
Also Read: TG Job Notifications: తెలంగాణలో త్వరలో 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏయే పోస్టులున్నాయంటే..?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 34
ఇంటర్వ్యూ డేట్: మే 28